భారత్‌లో 24 గంటల్లో 6,654 మందికి కరోనా

భారత్‌లో 24 గంటల్లో 6,654 మందికి కరోనా

భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ప్రతాపాన్ని విస్తృతం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 6,654 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,25,101కి చేరింది. వీరిలో 51,783 మంది కోలుకోగా.. 69,597 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా మరో 137 మంది మరణించడంతో మృతుల సంఖ్య 3,720కి పెరిగింది. గత నాలుగు రోజుల్లో దాదాపు 25 వేల కేసులు నమోదుకావడం గమనార్హం.
వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 44582కు పెరిగింది. వీరిలో 12,583 మంది కోలుకోగా.. 1517 మంది మృత్యువాతపడ్డారు. ఇక 14,753కేసులతో గుజరాత్‌ తర్వాతి స్థానంలో ఉంది. వీరిలో 98 మంది మృత్యువాతపడగా.. 7128 మంది కోలుకొని ఇళ్లకు చేరారు.