సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేయబోతున్న పూరీ జగన్నాథ్

PURI JAGANNADH DIRECTS SALMAN KHAN

పూరీ జగన్నాథ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పూరీ.. సల్మాన్‌కు సరిపోయేలా ఓ అద్భుత కథను రాసుకున్నారట. ఇక దీన్ని త్వరలోనే ఆయనకు వినిపించబోతున్నట్లు సమాచారం.
కాగా బాలీవుడ్ పూరీకి కొత్తేం కాదు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌తో 'బుడ్డా హోగా తేరే బాప్' అనే చిత్రాన్ని పూరీ హిందీలో తెరకెక్కించారు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఆ తరువాత మళ్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చారు పూరీ. ఇక ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్న క్రమంలో, తరువాతి సినిమాను కూడా పాన్‌ ఇండియాగా తీయాలన్న ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.