మాస్కు ధరించడం ఎంత అవసరమో చెప్తున్న మహేశ్

MAHESH TWEET ABOUT IMPORTANT OF MASK

ఇటీవల లాక్‌డౌన్‌-4లో కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరోనాను దరిచేరకుండా ఉంచేందుకు మాస్కు ధరించడం ఎంత అవసరమో మహేశ్‌ తన అభిమానులకు వివరించారు. ఈమేరకు ట్విటర్‌ ద్వారా విలువైన సూచనలు అందించారు. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్నారని, ఈ సమయంలో కరోనా వ్యాప్తి చేందే అవకాశం ఎక్కువగా ఉన్నందున తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని మహేశ్‌ సూచించారు.
మళ్లీ మనం సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్నాం. ఇది కాస్తా నెమ్మదిగా కావచ్చు. కానీ తప్పకుండా సాధారణ పరిస్థితుల్లోకి వస్తాం. ఈ సమయంలో మాస్కు ధరించడం తప్పనిసరి. గుర్తు పెట్టుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసరి మాస్కు ధరించండి. కనీసం ఇలా చేయడం వల్ల అయినా మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఇతరులను సురక్షితంగా ఉంచవచ్చు. మాస్కు ధరించడం వల్ల మరోలా కనిపించవచ్చు. కాని ఇది చాలా అవసరం. ఖచ్చితంగా మనం దీనిని అలవాటు చేసుకోవాలి. దీనిని స్వీకరించి కొత్తగా తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభిద్ధాం. నేను మాస్కు ధరించా.. మరి మీరు?'' అంటూ ప్రిన్స్‌ మహేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.