దుల్కర్ సరసన పూజహెగ్డే

POOJA ACT WITH DULKAR

టాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఈ భామకు వరుసపెట్టి సినిమాలు ఒళ్లో వాలుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ 20వ సినిమాలో నటిస్తున్న పూజా త్వరలో దుల్కర్‌ సల్మాన్‌తో జతకట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 'అందాల రాక్షసి' 'పడి పడి లేచే మనసు' ఫేం హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్‌ తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.