ప్రకాశం జిల్లాలో దారుణం

WORSE INCIDENT PRAKASHAM DISTRICT

ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు చెంచు గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. రాజయ్య అనే వ్యక్తిని చిన్నయ్య అనే మరో వ్యక్తి అంబు (బాణం)వేసి చంపేశాడు. రాజయ్య పొట్టలోకి బాణం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గతంలో రాజయ్య ఇచ్చిన రూ.2వేల అప్పును తీర్చమన్నందుకు చిన్నయ్య దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.