వాహనదారులకు శుభవార్త

GOOD NEWS TO VEHICLE OWNERS

లాక్‌డౌన్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు ఉపశమనం కల్పించారు. కోర్టుకు వెళ్లకుండా ఈ-కోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 3.25 లక్షల కేసులు నమోదు అయ్యాయి. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు పరిష్కరించాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. కోర్టు నుంచి సానుకూల స్పందన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులు నమోదైన వారికి ముందే తేదీ, టైం స్లాట్‌ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.