డాక్టర్ సుధాకర్ కేసులో.. సంచలన మలుపు..!

cbi to investigate dr sudhakars case 

విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది.  ఈ కేసు విచారణ చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. ఈ క్ర‌మంలో ఎనిమిది వారాల్లో ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ సిబీఐని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటి పై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది.

ఈ క్ర‌మంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక పైన నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది . దీని వెనుక కుట్ర ఉన్నదన్న అనుమానాలు బలపడుతున్నాయని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.  ఇక దాడికి పాల్పడిన పోలీసుల పై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ పేర్కొంది. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి పై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిషన్ పైన హైకోర్టు సమగ్రంగా విచారణ జరిపింది. దీంట్లో ప్రభుత్వ అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయనే కార‌ణంతోనే సీబీఐ విచారణకు ఆదేశించామని హైకోర్టు తెలిపింది