రెపో రేటు 0.4 శాతం కోత : మారటోరియం మరో 90 రోజులు

రెపో రేటు 0.4 శాతం కోత : మారటోరియం మరో 90 రోజులు

కరోనా వైర‌స్ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి రంగంలోకి దిగింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో తాజాగా 0.4 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ రెపో రేటు 4.4 శాతంగా అమలవుతోంది. రెపో రేటును తగ్గించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీంతో రివర్స్‌ రెపో సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. కోవిడ్‌-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతోపాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలియజేశారు.దీంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మ‌రో మూడునెల‌లు మార‌టోరియం పెంచుతున్న‌ట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగ‌స్టు 31వ‌ర‌కు మారటోరియం విధిస్తున్న‌ట్లు తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు.