న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. మూడురోజుల వరుస లాభాల ప్రారంభానికి శుక్రవారం బ్రేక్‌ పడింది. నేటి ఉదయం ఆర్‌బీఐ గవర్నర్‌ మీడియా సమావేశం నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తత‌తో మార్కెట్‌ నష్టాల ప్రారంభానికి కారణమైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 30778 వద్ద మొదలైంది. నిఫ్టీ 57 పాయింట్లను కోల్పోయి 9049 వద్ద ప్రారంభమైంది.
ఉదయం గం 9:30ని.లకు సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 30895 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 9090.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయి 17,633 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గెయిల్‌, ఇన్ఫ్రాటెల్‌, శ్రీసిమెంట్‌, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.