ఆకలికి తట్టుకోలేక.. కుక్క కళేబరాన్ని...

A MAN EAT DIED DOG...

కొద్దిరోజుల క్రితం బీహార్ లో పట్టెడు కూడు పెట్టే మనిషి లేక, ఆకలిని తట్టుకోలేని చిన్నారులు కప్పలను ఆహారంగా సేవించారు. అంతకు మించేలా ఓ వ్యక్తి ఆకలికి తట్టుకోలేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుక్క కళేబరాన్ని తినడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది. రాజస్థాన్ షాపురా ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై ఆకలికి తట్టుకోలేని ఓ వ్యక్తి చనిపోయిన కుక్క కళేబరాన్ని తిన్నాడు. అదే సమయంలో ఓ వాహనదారుడు కళేబరాన్ని ఎందుకు తింటున్నావని బాధితుడిని ప్రశ్నించగా ఆకలి తట్టుకోలేక తింటున్నట్లు చెప్పాడు.
దీంతో వాహనదారుడు తన వద్ద ఉన్న అన్నం ప్యాకెట్ ఇచ్చాడు. కళేబరాన్ని తినకూడదని వారిస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు.