జ‌గ‌న్ తీసుకున్న మ‌రో కీల‌క నిర్ణ‌యం ఇదే..!

ys jagan another key decision

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతం పూర్తిగా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మార్చి, ఏప్రిల్ నెలలో యాభై శాతం జీతాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఈ క్ర‌మంలో పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి తప్పించి..అన్ని శాఖల వాళ్ళకు సగం సగం జీతాలే అందాయి. ఎందుకంటే కరోనా దెబ్బకు సర్కారుకు వచ్చే ఆదాయం కూడా దారుణంగా పడిపోవటంతో జీతాల్లో కోతలు పెట్టారు.

అయితే తాజాగా సీయం జగన్ మోహ‌న్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వోద్యోగులకు మే నెల పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. అయితే కట్ చేసిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన సగం జీతాలను ఎప్పుడు ఇవ్వాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపులతో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్న నేప‌ధ్యంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు