వైసీపీ వారోత్స‌వాలు.. య‌న‌మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

yanamala ramakrishnudu comments on ysrcp

వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వారం రోజుల పాటు వైసీపీ సేవా కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీన అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీ నాయకత్వం పిలుపు నిచ్చింది. అలాగే కరోనా సమయంలో ఈ వారం రోజుల పాటు వైసీపీ నేతలు నిబంధనలను పాటిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరింది.

అయితే వైసీపీ వారోత్స‌వాల పై టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు ఎందుకని.. వైసీపీ పాల‌న‌లో ఏం చేశార‌ని, సంబరాలు దేనికని య‌న‌మ‌ల‌ నిలదీశారు. అన్నా క్యాంటిన్లు మూసివేసి మద్యం షాపులు తెరిచినందుకు సంబారాలు చేసుకుంటున్నారా.. కరోనా కేసుల సంఖ్య పెంచామని సంబరపడుతున్నారా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని యనమల రామ‌కృష్ణుడు డిమాండ్ చేశారు.