వైసీపీ స‌ర్కార్ పై చంద్ర‌బాబు ఫైర్..!

chandrababu comments on ysrcp sarkar

వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ‌మైన పాల‌న‌పై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంద‌ని, దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ పోరాటాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. క‌రోనా లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే.. ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ల మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

ఇక ఓ వైపు విద్యుత్ వినియోగం తగ్గిందంటూ ప్రభుత్వం చెబుతూనే.. బిల్లుల భారం ప్రజలపై ఎలా మోపుతారని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, మూడు నెలల విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక‌పోతే పాత స్లాబుల్లోనే విద్యుత్ ఛార్జీలను వసూలు చేయాలని చంద్రబాబు కోరారు. ప్రజలు మద్దతు ఇవ్వకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.