టీడీపీ నేతలు దీక్షలు.. జేసీ బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

jc diwakar reddy sensational comments

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దీక్షలు ఎందుకు చేస్తున్నారో త‌న‌కు అర్థం కావడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇంట్లో ఉండి దీక్ష చేస్తే జగన్ స్పందిస్తారా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో 158 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే స్పందించ‌ని జ‌గ‌న్, ఇళ్ళ‌ళ్ళో కూర్చుని దీక్ష‌లు చేసినంత మాత్రాన జ‌గ‌న్ దిగివ‌చ్చే అవ‌కాశాంలేద‌న్నారు. 

ఇక‌ పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడుపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ‌పై జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నాని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. వాళ్లదే రాజ్యం కాబట్టి వైసీపీ వాళ్లు టీడీపీ నేతల పై దాడులు చేస్తున్నారని జేసీ బ్ర‌ద‌ర్ అన్నారు.  ఇక రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఏం చూస్తామని వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక టీడీపీ విషయానికి వస్తే తల బాగుండి, కాళ్లు, చేతులకు పక్షవాతం వచ్చినట్లు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.