24 గంటల్లో 5609 క‌రోనా కేసులు.. 132 మంది మృతి

24 గంటల్లో 5609 క‌రోనా కేసులు.. 132 మంది మృతి

భారత్‌లో క‌రోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో5,609 మందికి కొత్తగా కరోనా సోకింది.
గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3435కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,12,359కి చేరింది. 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.