మానవీయ సంబంధాలు మంట కలిపారు.

WORSE INCIDENT IN MADHYA PRADESH

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో జరిగిన ఘోరం ఇది. 45 ఏళ్ల తండ్రే కూతుర్ని రేప్ చేసినట్లు తెలిసింది. ఇదే దారుణం అనుకుంటే... ఈ దారుణానికి కూతురి తల్లి కూడా... తన భర్తకు సహకరించడం మరింత దారుణం. ఘోరం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన ఆమెను ఏమనాలి? ఇలా ఎందుకు చేశారంటే... కూతురు స్థానిక ఓ యువకుడితో ప్రేమలో పడటమే కారణమట. కూతురికి తగిన బుద్ధి చెప్పాలనే ఇలా చేశారట. చివరకు బాధితురాలి సోదరి... బాధితురాలిని ఆ దుర్మార్గపు తల్లిదండ్రుల నుంచి కాపాడింది.

ఈ ఘటనలో తండ్రి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాడు. బాధితురాలి వయసు 18 ఏళ్లు. ముగ్గురు కూతుళ్లలో ఆమే చిన్నది. కరోనా లాక్‌డౌన్ విధించాక.
ఆ యువతిపై తండ్రి... రెండుసార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత... భార్యభర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

మార్చి 26 మధ్యాహ్నం 2 గంటల సమయంలో... మొదటిసారి ఆ తండ్రి కూతుర్ని రేప్ చేశాడు. ఆ సమయంలో... బాధితురాలు కిచెన్‌లో వంట పని చేస్తోంది. ఆ గదిలోకి వెళ్లిన తండ్రి... జుట్టు పట్టుకొని ఆమెను బెడ్‌రూంలోకి లాక్కెళ్లాడు. బెడ్‌కి తోసి... తాళ్లతో కట్టేశాడు. ఆమె అరుస్తుంటే... తల్లి... ఓ గుడ్డ తెచ్చి కూతురి నోట్లో కుక్కింది. "ముందే ఇలా జరిగితే... రేపు నీకు పెళ్లైతే... పెద్ద కష్టంగా ఉండదు" అంటూ రేప్ చేశాడని తెలిసింది. ఈ దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాధితురాలు లోలోన కుమిలిపోయింది.ఏప్రిల్ 10న ఆ యువతి... తన తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో... తన ఆంటీ ఇంటికి వెళ్లి దాక్కుంది. ఈ విషయం ఎలా కనిపెట్టాడో గానీ... ఆ తండ్రి... ఆ ఇంటికి వెళ్లి కూతుర్ని లాక్కొచ్చేశాడు. మరోసారి రేప్ చేశాడు. ఈసారి బాధితురాలు తన కన్నీటి వ్యధను... పెద్దక్కకు చెప్పుకొని ఏడ్చేసింది. ఆగ్రహంతో రగిలిపోయిన పెద్దక్క... పుట్టింటికి... వచ్చి... తల్లిదండ్రులకు గడ్డి పెట్టి... తన చెల్లిని తనతో తీసుకుపోయింది. అంతే కాదు... మహిళా క్రైమ్ సెల్‌ నెంబర్ 1098కి కాల్ చేసి... మేటర్ చెప్పింది. కేసు రాసిన పోలీసులు అరెస్టు చేశారు.