సుప్రీం కోర్టులో టీడీపీ పప్పులు ఉడ‌క‌లేదు..!

supreme court shocked to tdp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న భావనతో సుప్రీం కోర్టుకు వెళ్లిన టీడీపీ నేతలకు ఎదురు దెబ్బతగిలింది. స్థానిక ఎన్నికలలో ఏభై శాతం మించి రిజర్వేషన్లు ఉండానికి వీలు లేదని గతంలోనే సుప్రింకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఎపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపడానికి నిర్ణయించగా, దానిని టీడీపీ నేతలు విమర్శించారు. 

ఈ క్ర‌మంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇస్తూ ఏభై శాతం మించి రిజర్వేషన్‌లు కుదరదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు వెలువరించింది. దీంతో టీడీపీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.