ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ: పోతిరెడ్డిపాడుపై ఎన్‌జీటీ స్టే

ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ: పోతిరెడ్డిపాడుపై ఎన్‌జీటీ స్టే

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యుడు, హైదరాబాద్ ఐఐటీ నుంచి ఒక సభ్యుడు, కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు ఉంటారు. రెండు నెలల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కమిటీని గ్రీన్ ట్రైబ్యునల్ కోరింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక ఈ వ్యవహారంపై నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో కేసును విచారణ చేసిన బెంచ్... నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. అదే సమయంలో కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఇక ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీలో కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌కు చెందినవారికి కమిటీలో సభ్యత్వం కల్పించినట్లు ఎన్జీటీ తెలిపింది. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఎన్జీటీ సూచించింది.