ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రమానుషం

BOMB BLAST IN AFGHANISTAN

ప్రపంచం పై  కరోనా దాని ప్రభావాన్ని చూపిస్తుంటే, ఆఫ్ఘనిస్థాన్ పై ఉగ్రవాదులు తమ పంజాను విసురుతున్నారు. 

తూర్పు పక్తియా ప్రావిన్స్‌ గార్డిజ్ నగరంలోని రక్షణ శాఖ స్థావరం గేటు ముందు కారు బాంబు పేలి ఐదుగురు మృతిచెందారు. ఐదుగురు భద్రతాసిబ్బంది సహా మరో 19 మంది గాయపడ్డారు. ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ అధికార ప్రతినిధి మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.

ఉగ్రవాదులు ఒక పాత కారులో బాంబులు పెట్టి రక్షణశాఖ స్థావరం గేటు ముందు నిలిపారని, ఈ ఉదయం తొమ్మది గంటల సమయంలో దాన్ని పేల్చివేశారని ఆయన తెలిపారు. కాగా, ఈ కారు బాంబు పేలుడు ఘటనకు బాధ్యులం తామేనని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.