అర్జున అవార్డు రేసులో బుమ్రా, శిఖర్ ధావన్!

అర్జున అవార్డు రేసులో బుమ్రా, శిఖర్ ధావన్!

క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన చేసే వారికి అర్జున అవార్డు అందిస్తారు. అయితే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు బీసీసీఐ భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ పేర్లను నామినేట్ చేయాలనీ భావిస్తుంది. అయితే 2019లో రవీంద్ర జడేజా, బుమ్రా రేస్ లో ఉండగా జడేజా ఆ అవార్డు దకించుకున్నాడు. అయితే మహిళల విభాగంలో ఇప్పటికే ఈ అవార్డు కోసం దీప్తి శర్మ, శిఖా పాండే పేర్లు నామినేట్ చేసింది బీసీసీఐ.
అయితే గత సంవత్సరం పురుషుల విభాగంలో బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ అనే మూడు పేర్లను పంపించాము. అయితే ఎంపిక యొక్క ప్రమాణాలకు అత్యధిక స్థాయిలో కనీసం మూడేళ్ల పనితీరు అవసరం. అందుకే సీనియర్, చాలా సంవత్సరాలు స్థిరమైన ప్రదర్శన చేస్తున్న జడేజాకు ఆ అవార్డు దక్కింది అని బీసీసీఐ ఆ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల నుండి 68 వికెట్లు, 64 వన్డేల నుండి 104 వికెట్లు, 50 టీ 20ల నుండి 59 వికెట్లు సాధించాడు. ఇక ఒకవేళ బుమ్రా కాకపోతే రెండవ స్థానంలో ధావన్ పేరు ప్రస్తావనలో ఉంది. అయితే చూడాలి మరి ఈసారి ఆ అవార్డు ఎవరికి వస్తుంది అనేది.