అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తగ్గించి చెప్తున్నారు

confusion in america corona dies

అమెరికాలో మృతుల సంఖ్యపై గందరగోళమేర్పడుతోంది. కరోనా మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉంటుందని వైట్‌హౌస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.
అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తివేయడానికి వైట్‌హౌస్ రచిస్తున్న ప్రణాళికలు సరి కావని, లాక్‌డౌన్ ఎత్తివేస్తే వైరస్ మరింతగా వ్యాపిస్తుందని ఆయన హెచ్చరించారు.