రష్యా అద్యక్షుని‌ అధికార ప్రతినిధికి కరోనా

 Corona to Russia president's Authorized Representative

రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా భారిన పడ్డారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో చికత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుంచి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. రెండు వారాల క్రితం రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోవడంలో రష్యా విజయవంతమైందని అద్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన అధికార ప్రతినిధికి వైరస్ సోకడం గమనార్హం.