కరోనాను కంట్రోల్ చేసేందుకు సిద్ధమైన WHO

WHO stepped into Field to Control corona

తోంది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్  ప్రజలు తీవ్రభయానికి గురవుతున్నారు. చైనాలో ఇప్పటికి కరోనా దెబ్బకు సుమారు మూడువేల మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పడ్డ ఈ మహమ్మారి విశ్వవ్యాప్తంగా చెలరేగుతోంది. కరోనా ఇప్పుడు ఇటలీ, దక్షిణ కొరియాలో తన పంజా విసిరింది. ఇప్పటికే ఆయా దేశాల్లో అనేక మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కూడా కరోనా కారణంగా కొన్ని మరణాలు సంభవించాయి. మనదేశంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు దీని నివారణ కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ముందు జాగ్రత్తలు తప్ప మందులు లేని కరోనాను నివారించేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వేగంగా అడుగులు వేస్తోంది. అందుకు కావాల్సిన సిద్దమయ్యి రంగంలోకి దిగుతోంది. మరో వైపు ప్రపంచ బ్యాంకు కూడా కరోనా నివారణ నిమిత్తం పన్నెండు బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. ఉచితంగా మాస్కుల పంపిణీ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.