టీ20 ప్రపంచకప్ :  టీమ్ ఇండియా మ‌హిళ‌లు.. జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తారా..!

 icc womens t20 world cup latest news

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టీమ్ ఇండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌సంగ‌తి తెలిసిందే. గ్రూప్ ద‌శ‌లో జ‌రిగిన‌ నాలుగు మ్యాచుల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన టీమ్ ఇండియా.. టీ20 ప్రపంచకప్ టైటిల్ ల‌క్ష్యంగా దూసుకుపోతూ గ్రూప్ - ఏలో 8 పాయింట్ల‌తో టాప‌ర్‌గా నిలిచింది. ఇక అల‌వోక‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన హ‌ర్మ‌న్ సేన, గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.  

ఇక ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో, మూడు సార్లు సెమీస్ వ‌ర‌కు వెళ్లిన టీమ్ ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఫైనల్‌కు చేరుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈసారి హ‌ర్మ‌న్ సేన ఊపు చూస్తుంటే.. టీమ్ ఇండియా ఫైన‌ల్‌కు చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అటు సీనియ‌ర్లు, ఇటు జూనియ‌ర్ల‌తో స‌మ‌తూకంగా ఉన్న టీమ్ ఇండియా ఈసారి ఎలా అయినా టైటిల్ కొట్టాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఈ ప్రెస్టీజియ‌స్ టోర్నీలో బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తూ జైత్రయాత్ర కొన‌సాగిస్తున్న మ‌న టీమ్ఇండియా వుమెన్స్ వ‌రల్డ్ టైటిల్ సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.