ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు : అసదుద్దీన్ ఒవైసీ

Submitted by editor on Mon, 02/03/2020 - 08:20

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యార్థులపై కాల్పులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని ఒవైసీ మండిపడ్డారు. లోక్ సభలో ఈ రోజు మాట్లాడిన ఆయన వారం రోజుల వ్యవధిలో జామియా వర్సిటీ విద్యార్థులు లక్ష్యంగా మూడు సార్లు కాల్పులు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సంఘ్ పరివార్ శక్తులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాయని.. మేం జామియా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తామని ఒవైసీ స్పష్టం చేశారు.

కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్

Submitted by editor on Mon, 02/03/2020 - 07:55

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కర్నూలుకు కార్యాలయాలను తరలించడాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరిస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ ఉత్వర్వులను రైతులు సవాల్‌ చేశారు.  రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

Submitted by editor on Mon, 02/03/2020 - 07:39

మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యావల్‌ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంకలేశ్వర్- బుర్హాన్ పూర్ జాతీయ రహదారిపై కారు, డంపర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. మృతుల్లో ప్రభాకర్‌ నారాయణ్‌ చౌదరి, ఆయన భార్యతో పాటు 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

కేరళలో మూడో కరోనా కేసు..!

Submitted by editor on Mon, 02/03/2020 - 07:21

చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. మరోవైపు కరోనా వైరస్ కేరళలో ముగ్గురికి సోకిందని ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదు కాగా.. వీరిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ త్వరగా వ్యాప్తిచెందడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహంచారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల్ని సమీక్షించారు. ప్రజలు చైనా ప్రయాణాల్ని మానుకోవాలని..

శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన ఏపీ సీఎం

Submitted by editor on Mon, 02/03/2020 - 06:40

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు చేశారు. విశ్వశాంతి యాగంలో జగన్ పాల్గొన్నారు.

మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలి : తమిళిసై

Submitted by editor on Mon, 02/03/2020 - 06:33

దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఇవాళ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో 12వ ఆసియా మైక్రోస్కోపిక్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. సునిశిత పరిశీలన, శోధనకు మైక్రోస్కోప్‌లు ఎంతో దోహదపడతాయని అన్నారు. మనిషి అపోహలను, మూఢనమ్మకాలను మైక్రోస్కోప్‌ తుడిచిపెట్టిందని గవర్నర్‌ గుర్తుచేశారు. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న జీవుల్ని విజువలైజ్‌ చేసే పరిజ్ఞానం మైక్రోస్కోప్‌లదని.. ప్రపంచం ఈ విధంగా అభివృద్ధి సాధించిందంటే మూలకారణం మైక్రోస్కోపేనని గవర్నర్‌ వెల్లడించారు. 
 

అక్కాచెల్లెళ్ల కాళ్ళు కట్టి.. రోడ్డు పై ఈడ్చుకెళ్లి..!

Submitted by editor on Mon, 02/03/2020 - 06:29

తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై కొట్టి, ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్మృతి దాస్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్‌లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు.

అఖిల్ సినిమా టైటిల్ ఇదేనా..?

Submitted by editor on Mon, 02/03/2020 - 06:23

అక్కినేని అఖిల్.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో. అఖిల్ సినిమా హిట్  కోసం అక్కినేని అభిమానులు ఆసక్