mahanati

‘మహానటి’కి పన్ను మినహాయింపు పరిశీలిస్తాం: చంద్రబాబు

Updated By ManamSat, 05/26/2018 - 14:33

keerthy suresh ‘మహానటి’ టీంకు ప్రశంసల వెల్లువలు ఆగడం లేదు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు మహానటి టీంను సత్కరించగా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మహానటి’ టీంకు సన్మానం చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక, స్వప్నాదత్, హీరోయిన్ కీర్తి సురేశ్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిలను చంద్రబాబు సత్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి ఆత్మవిశ్వాసం అందరికీ స్పూర్తి అని, ఆమె జీవితకథను బాగా పరిశోధించి నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపును పరిశీలిస్తామని వెల్లడించారు. కాగా విడుదలై మూడు వారాలు దాటినా ఈ చిత్రం థియేటర్లలో ఇంకా సత్తా చాటుతోంది. అటు తమిళనాడు, కేరళలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది మహానటి.

 

ఫొటోల కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.

 

‘మహానటి’ సినిమా యూనిట్‌ను సన్మానించిన సీఎం చంద్రబాబు'మ‌హాన‌టి'.. 12 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamMon, 05/21/2018 - 20:02

mahanatiఅభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. 12 రోజుల‌కిగానూ (ఆదివారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.17.32 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.29.12 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమా.. బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది.‘మహానటి’ సావిత్రి డబ్బింగ్‌ను చూశారా..?

Updated By ManamSun, 05/20/2018 - 13:12

Savitri సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది కీర్తి సురేశ్. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయితే కీర్తి, సావిత్రిని గుర్తుచేసింది పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కోసం కీర్తి సురేశ్ చెప్పిన డబ్బింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేశ్. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 2 మిలియన్ క్లబ్‌లో ‘మహానటి’

Updated By ManamSat, 05/19/2018 - 08:24

Mahanati సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది మహానటి. కథ, కథనంతో పాటు ప్రధానపాత్రాధారుల నటన, దర్శకత్వం, సంగీతం ఇలా ప్రతి విభాగంలోనూ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.

 'మ‌హాన‌టి'.. 9 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamFri, 05/18/2018 - 21:55

mahanatiన‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. తొమ్మిది రోజుల‌కిగానూ (గురువారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.12.8 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.23.25 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్న ఈ మూవీ.. ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ అవ‌డ‌మే కాకుండా లాభాల బాట ప‌ట్టింద‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా..ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా $2 మిలియ‌న్లు రాబ‌ట్టుకుంది.ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు షాకిచ్చిన సావిత్రి

Updated By ManamThu, 05/17/2018 - 21:55

savitriతెలుగు సినీ పరిశ్రమకు మ‌హాన‌టులు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. అటువంటి మహానటులు సైతం వారి సినిమాల్లో అల‌నాటి మేటి న‌టి సావిత్రి ఉండాల‌ని నిర్మాతలను డిమాండ్ చేసారంటే.. సావిత్రి నటనా ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఇద్ద‌రు హీరోల‌తో సమానంగా అప్పట్లో పారితోషికాన్ని అందుకున్న లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి.. రెండు సందర్భాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను సైతం ఆశ్చర్యానికి గురి చేశార‌ట‌.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 1977 సంవ‌త్స‌రంలో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి  తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఆ వైపరీత్యానికి బాధితులైన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సావిత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది అభిమానులు ఎన్టీఆర్‌ను పూలమాలతో సత్కరిస్తే.. ఆ మాలను వేలం పాటలో రూ.10,000కు సొంతం చేసుకున్నారు సావిత్రి. దానికి షాక్ అయిన‌ ఎన్టీఆర్ “కేవ‌లం ఒక పూలదండ‌ కోసం డబ్బులను ఎందుక‌లా దుబారాగా ఖర్చు చేస్తావ్?” అని హెచ్చరించారట. దానికి బదులుగా ఆమె, “ఇది అందరికీ మాలే కాని నాకు మాత్రం వెల కట్టలేని వస్తువు. అదీగాక ఈ రూపంలో ఈ బాధితులకు సాయం చేసినందుకు ఆనందంగా కూడా ఉంది” అని బదులిచ్చారట.

మరొక సందర్భంలో చెన్నైలో ఒక ఇంటిని కట్టుకున్న ఏఎన్నార్, తన పాత ఇంటిని అమ్మకానికి పెడితే.. ఒక బ్లాంక్ చెక్కుతో ఆ ఇంటి విలువను రాసుకోమని చెప్పారట సావిత్రి. దీంతో.. ఏఎన్నార్ షాక్‌కు గుర‌వ‌డ‌మే కాకుండా త‌న‌ ఈగో కూడా హ‌ర్ట‌య్యింద‌ట‌. తన అభిమాన నటుడి ఇంటిని వెల కట్టడం తన వల్ల కాదన్న‌దే ఆమె భావన కావ‌డంతో.. అలా చేశార‌ట‌. ఆమె ఉద్దేశం ఏదైనా.. ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని అప్పట్లో కొంతమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదేమైనా.. ఈ రెండు సందర్భాలను ‘మహానటి’ సినిమాలో చూపించి ఉంటే మ‌రింత‌ బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.సౌంద‌ర్య బ‌యోపిక్ చేయ‌నున్న స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌?

Updated By ManamThu, 05/17/2018 - 18:39

soundaryaఅలనాటి మేటి న‌టి సావిత్రి బయోపిక్ ‘మహానటి’.. తాజాగా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో.. ఇప్పుడు తెలుగులో మరిన్ని బయోపిక్‌లు కార్యరూపం దాల్చనున్నాయి. ఇందులో భాగంగానే నిన్నటితరం నటీమణి సౌందర్య జీవిత కథను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 1992లో కెరీర్‌ను ప్రారంభించి 2004 వరకు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మ‌ల‌యాళం, హిందీ భాషల్లో మొత్తం 100కి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే.. 2004 ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికని వెళ్ళి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా దుర్మరణం పాల‌య్యారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటీమణి జీవిత కథను బయోపిక్‌గా తీస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత రాజ్ కందుకూరి ('పెళ్ళి చూపులు', ‘మెంటల్ మదిలో’ చిత్రాల నిర్మాత) భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన‌  అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బయోపిక్ (‘యన్.టి.ఆర్’), వై.ఎస్‌.ఆర్‌ బయోపిక్ (‘యాత్ర’) నిర్మాణ ద‌శ‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. తాజాగా ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.నాన్న పాత్రను తప్పుగా చూపారు: జెమినీ గణేషన్ కుమార్తె

Updated By ManamThu, 05/17/2018 - 09:38

kamala  సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో తన తండ్రి పాత్రను తప్పుగా చూపించారని జెమినీ గణేషన్ మొదటి భార్య కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కంటే ముందే జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లను కూడా కన్నారని, తొలి ప్రేమ సావిత్రి మీద కాదని, తన తల్లిమీదేనని తెలిపారు. 

ఇక సినిమాలో చూపించినట్లు సావిత్రికి జెమినీ గణేశన్ మద్యం అలవాటు చేయలేదని, ఆమెనే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని కమలా సెల్వరాజ్. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ‘ప్రాప్తం’ సినిమా నుంచి వెనక్కు తగ్గాలని చెప్పడానికి నాన్నతో పాటు తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్లామని.. ఆ సమయంలో ఆమె తమపైకి కుక్కులను ఉసిగొల్పిందని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు. అయినా ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ అనే బిరుదును ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అయితే మరోవైపు ఈ చిత్రంపై సావిత్రి, జెమినీ గణేశన్ కుమార్తె, కుమారుడు చాముండేశ్వరి, సతీశ్‌లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన తల్లికి ఈ చిత్రం ఘన నివాళి అని వారు తెలిపారు. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.‘మనం’ ద‌ర్శకుడితో అశ్వనీద‌త్ చిత్రం?

Updated By ManamWed, 05/16/2018 - 22:00

c.aswanidutth‘ఎదురులేని మనిషి’, ‘అడవి సింహాలు’, ‘అగ్నిపర్వతం’, ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’ లాంటి సూప‌ర్‌ హిట్ చిత్రాలను అందించిన సంస్థ వైజయంతి మూవీస్. గత కొంత‌ కాలంగా స‌రైన‌ విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ సంస్థ.. తాజాగా విడుదలైన ‘మహానటి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంస్థకు పూర్వ వైభవాన్ని అందించింది. ఈ సినిమా అందించిన విజయంతో వరుస చిత్రాలు చేయడానికి నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు.. మహేష్‌ బాబు 25వ చిత్రాన్ని మరో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. అంతేగాకుండా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘మహానటుడు’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ‘ఇష్క్’, ‘మనం’, ‘24’, ‘హలో’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కూడా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే విక్ర‌మ్ కుమార్ సినిమాపై క్లారిటీ రానుంది.ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ రానుందా?

Updated By ManamWed, 05/16/2018 - 20:43

udayతెలుగునాట బ‌యోపిక్‌ల ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో..  అదే బాట‌లో మ‌రిన్ని బ‌యోపిక్ చిత్రాలు తెర‌పైకి రావ‌డానికి ముస్తాబవుతున్నాయి. వాటిలో.. ఒక‌ప్పటి యువ సంచలనం ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాస్త‌ వివరాల్లోకి వెళితే..  ‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో క‌థానాయ‌కుడిగా సంచలనాన్ని సృష్టించారు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అంతేగాకుండా..  ఫిల్మ్‌ఫేర్‌ను (‘నువ్వు నేను’ చిత్రానికి గాను) అందుకున్న అతి పిన్న వయస్కుడిగా (21 సంవత్సరాలు) కమల్ హాసన్ తర్వాత ఆ జాబితాలో చేరారు ఉదయ్ కిరణ్.  అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌..  ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. అవి ఎంతవరకు తీసుకుని వెళ్ళాయంటే.. ఆఖరికి ఈ యువ కథానాయకుడు బతుకు భారం మోయలేక తనువు చాలించే స్థాయికి దిగజార్చేసాయి.

మహానటి సావిత్రి జీవితానికి కాస్త అటు ఇటుగా ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ యంగ్ హీరో జీవితాన్ని కూడా బయోపిక్‌గా తీయడానికి దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్‌తో మంచి అనుబంధం ఉండడం.. అంతేగాక వీరిద్దరి కెరీర్ కూడా ‘చిత్రం’ సినిమాతోనే ప్రారంభం కావడంతో.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తేజ తెరకెక్కించడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాని తేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తారో చూడాలి. అన్న‌ట్టు.. ఇటీవ‌లే 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నుంచి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Related News