tollywood

మరో రెండు ఇండస్ట్రీల వైపు చూపు

Updated By ManamThu, 08/16/2018 - 01:35

imageహీరోగా ఉండి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన జగపతిబాబు నటుడిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ విలక్షణ నటుడు హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే బిజీగా ఉన్నారు. దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన జగ్గూభాయ్ ఈ ఏడాది ‘దబాంగ్3’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా మరో రెండు చిత్ర పరిశ్రమల్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి జగపతిబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అందులో ఒకటి బోజ్‌పురి చిత్ర పరిశ్రమ కాగా.. మరొకటి పంజాబీ చిత్ర పరిశ్రమ. ఇటీవల ఈ రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు జగపతిబాబును కలిసి ఆయనతో చర్చలు జరిపారట. జగ్గూ భాయ్ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. హన్సిక హాఫ్ సెంచరీ

Updated By ManamMon, 08/13/2018 - 05:57

ఇదేంటి పట్టుమని పాతికేళ్లు లేని పిల్లను పట్టుకుని 50 అంటున్నారు? ఇంతకీ మీరు చెప్పేది హన్సిక వయసా? లేకపోతే ఆమె తాజా సినిమా ఆడిన రోజులా? ఆమె తీసుకుంటున్న పారితోషికమా?... అబ్బబ్బ.. కాసేపు ప్రశ్నలు ఆపండి బాసూ. హన్సికకి 50 అంటే.. హన్సిక చేసిన సినిమాల సంఖ్య 50 అని చెప్పొచ్చామంతే. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమకు పరిచయమైన హన్సిక తెలుగులో ‘దేశముదురు’తో అడుగుపెట్టింది. తమిళంలో ధనుష్ హీరోగా ఆమె తొలి సినిమా ‘మాప్పిళ్లై’. అంతకు ముందు ‘హవా, కోయీ మిల్‌గయా’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు 50వ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
image
గిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను హన్సిక తొలి చిత్ర హీరో ధనుష్ విడుదల చేశారు. ఆ సినిమాకు ‘మహా’ అనే టైటిల్‌ను పెట్టా రు. హన్సిక అతి త్వరలో 50వ మైలురాయిని చేరు కోవడం ఆనందంగా ఉందని నటుడు ధనుష్ తెలి పారు. తెలుగు ప్రేక్షకులకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న హన్సిక కావాలనే ‘మహా’ చిత్రాన్ని తెలుగు లోనూ రూపొందించాలని పట్టుబట్టినట్టు సమా చారం. ఇది ఫక్తు లేడీ ఓరియంటెడ్ సినిమా. విజయ్‌ దేవర‘కొండ’oత సాయం!

Updated By ManamSun, 08/12/2018 - 21:25

Vijay Deverakonda donates Rs 5 lakh for Kerala flood relief fund

‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ రీల్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఇందుకు కారణం విజయ్ చేసిన రెండే రెండు పనులని చెప్పుకోవచ్చు. ఇటీవల తనకు వచ్చిన మొదటి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేయగా వచ్చిన 25లక్షలను విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. విజయ్ హెల్పింగ్ నేచుర్ చూసిన అభిమానులు, తెలంగాణ ప్రజలు ఆయన్ను మెచ్చుకున్నారు.

తాజాగా.. మరోసారి విజయ్ దేవర‘కొండ’oత మనసు చాటుకున్నాడు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇడుక్కితో సహా పలు జిల్లాలో నీటమునిగాయి. అన్నం, నీళ్లు లేక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో విరాళులు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ తన వంతు సాయం చేయాలని భావించి రూ. 5లక్షలు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. అభిమానుల్లారా మీ వంతు సాయం చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. దేవరకొండ పిలుపుమేరకు పలువురు అభిమానులు విరాళం అందించారు. డబ్బులు ఫలానా అకౌంట్‌కు తాము ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ట్విట్టర్‌లో తమ అభిమాన హీరో విజయ్‌ దేవరకొండకు ట్యాగ్ చేసి.. కామెంట్స్‌ రూపంలో తెలియజేశారు.

 

కాగా.. ఇప్పటికే కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, విశాల్, సూర్య, కార్తీలు తమకు తోచినంత కేరళ ప్రభుత్వానికి విరాళం అందించారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదట విరాళం ఇచ్చిన ఏకైక హీరో విజయ్ దేవరకొండ. మిగతా హీరోలు.. నటులు స్పందించి వరద బాధితులకు సాయం చేసి ఆదుకుంటే మంచిదని.. అలాగే వారి అభిమానులకు సైతం సాయం చేయాలని పిలుపునిస్తే ఇంకా మంచిదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కాగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరద, సునామీ లాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీల హీరోలు సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. వాటిలాగే కేరళకు కూడా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకుంటే మంచిది.‘వీడు అసాధ్యుడు’ ప్రారంభం

Updated By ManamFri, 08/10/2018 - 02:13

imageఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ బ్యానర్‌పై పి.ఎస్.నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్.కె.రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘వీడు అసాధ్యుడు’. కృష్ణసాయి, జహీదా శామ్ హీరో హీరోయిన్. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్టగా.. ఫస్ట్ షాట్ డైరెక్షన్ శివకృష్ణ, కెమెరా సిచ్చాన్ నిర్మాత సీతారామరాజు చేశారు.

 అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు పి.ఎస్.నారాయణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్.కె.రాజుగారే. ఆయనతో పదేళ్ల పరిచయం నాది. తిరుపతిలో క్రిమినల్ లాయర్‌గా పని చేసే ఆయన సినిమా నిర్మించాలనే కోరికతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. హీరోగా మాత్రం కృష్ణసాయి అనే స్క్రీన్ నేమ్‌ను పెట్టుకున్నారు. హీరోయిన్ జహీదా కాశ్మీర్ అమ్మాయి. కన్నడ, తెలుగులో మూడు సినిమాలు చేసింది. ఈ చిత్రంలో ఎన్.ఆర్.ఐ పాత్రలో నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.

ఎం.ఎస్.కె.రాజు మాట్లాడుతూ ‘‘ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. కృష్ణ సాయి అనే స్క్రీన్ నేమ్‌తో హీరోగా పరిచయం అవుతున్నాను. మంచి కంటెంట్‌తో కమర్షియల్ కథాంశంతో పాటు సామాజిక సృ్పహ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు’’ అన్నారు. సినిమాలు తీయడం రాదా? అనిపించింది

Updated By ManamFri, 08/10/2018 - 02:05

imageఅడివిశేష్, శోభిత దూళిపాళ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘గూఢచారి’ శశికిరణ్ తిక్క దర్శకుడు. అభిషేక్ నామ, అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సక్సెస్‌మీట్‌కు నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ న్యూ జనరేషనే.  వీళ్లు తెలుగు సినిమా ఫ్యూచర్. మీతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంతసేపు ఎలా చేశారో చూశాను.

సినిమా బడ్జెట్ గురించి తెలుసుకుని.. ఎలా సాధ్యమైందని ఆలోచించాను. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలను చూసి మేం అంత సోంబేరులా, బద్దకస్తులమా?.. మాకు సినిమాలు తీయడం రాదా? అనిపించింది. నాన్నగారు ఉండుంటే వీళ్లను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. డైరెక్టర్ శశి, అడివిశేష్, అబ్బూరి రవి కలిసి సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. యాక్షన్ సీన్స్ అన్ని హీరోయిక్‌గా ఉన్నాయి. నాతో ఎవరైనా ఇలాంటి సినిమా చేస్తారా? అని ఎదరుచూశాను. కానీ ఎవరూ ఎదురుకాలేదు. ఈ సినిమా చూసి నేను జెలస్‌గా, ఎగ్జయిటెడ్‌గా, హ్యాఫీగా ఫీలవుతున్నాను.  నేటి ట్రెండ్‌కు తగినట్లు కమర్షియల్ వేల్యూస్, సెన్సిబిలిటీస్ మిక్స్ చేసి అవుట్‌స్టాండింగ్ మూవీ చేశారు. శ్రీచరణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది.

 సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను చాలా చక్కగా నటించింది. తను రా ఆఫీసర్ రోల్‌కి చక్కగా సూట్ అయింది. సినిమా కలెక్షన్స్ గురించి నేను మాట్లాడటం లేదు. కొత్త దారిని చూపించిన చిత్రమిది. ఇండ్రస్టీకి 1989లో ‘శివ’ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్‌స్పిరేషన్ వచ్చిందో.. ‘గూఢచారి’ కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.  ‘గూఢచారి 2’కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న పేపర్ బాయ్

Updated By ManamFri, 08/10/2018 - 01:09

imageసంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘పేపర్ బాయ్’. బి.ఎల్.ఎన్.సినిమా, ప్రాచిత క్రియేుషన్స్ పతాకాలపై  సంపత్ నంది, రాములు, వెంక, నరసింహా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ శంకర్ దర్శకుడు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. రియాసుమన్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

స్రంపత్ నంది నిర్మాతగానే కాదు.. ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఓ ఇంజనీరింగ్ విధ్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలయ్యాయి.దీపావళికి ‘సవ్యసాచి’

Updated By ManamWed, 08/08/2018 - 00:46

imageఅక్కినేని నాగైచెతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘సవ్యసాచి’. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా సవ్యసాచి ఇప్పుడు చివరి దశలో షూటింగ్‌లో ఉంది. ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే నాగైచెతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్ట్ 31న విడుదల కావడమే కాదు.. సెప్టెంబర్ రెండో వారంలో కానీ ‘సవ్యసాచి’ సీజీ వర్క్ పూర్తి కాదు. అందువల్ల చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయాలనకుంటున్నారని సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, నటి భూమిక కీలక పాత్రల్లో నటించారు. గీతగోవిందం సెన్సార్ పూర్తి

Updated By ManamSat, 08/04/2018 - 23:19

imageవిజయ్ దేవరకొండ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ.2 పిక్చర్స్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ అందర్నీ ఆకట్టుకుంటాడు.

పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పరుశురాం దర్శకుడిగా మరో మెట్టు ఎదిగాడు’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి వున్న ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు’’ అన్నారు.

బన్ని వాసు మాట్లాడుతూ ‘‘మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. విజయ్ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్‌తో మరోక్కసారి ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది.  ఈ చిత్రాన్ని అగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. ఆటగాళ్లు వచ్చేస్తున్నారు 

Updated By ManamFri, 08/03/2018 - 23:58

imageజగపతిబాబు, నారా రోహిత్ నటిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. దర్శన్ బానిక్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 24న విడుదల చేయాలని నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకుడు. ఓ సినీ హీరోకి, క్రిమినల్ లాయర్‌కి మధ్య జరిగే మైండ్ గేమే ఈ చిత్రమని నిర్మాతలు తెలిపారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు  చేయడం లేదనిపించింది 

Updated By ManamThu, 08/02/2018 - 00:48

సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన చిత్రం ‘చి॥ల॥సౌ’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేుషన్స్ బ్యానర్స్‌పై ఆగస్ట్ 3న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా... నాగార్జున అక్కినేని మాట్లాడుతూ ..

ఫ్రెష్‌గా అనిపించింది...
image‘చి.ల.సౌ’ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. సింపుల్ పాయింట్ కానీ కట్టిపడేసేలా తెరకెక్కించారు. మంచి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని చక్కగా అమరాయి. సినిమా చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. సినిమా చూసిన తర్వాత నాకు నేనే ఫ్రెష్‌గా అనిపించాను. ఇలాంటి సినిమాలను నేను ఎందుకు చేయడం లేదు అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత రాహుల్‌ను కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. నీకు ఇంట్రస్ట్ ఉందా? అని అడిగాను. తను హ్యాపీగా ఫీలయ్యాడు. అలా ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. 

ఈ క్రెడిట్ తనదే...
- ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేసే సమయంలో స్క్రిప్ట్ స్టేజ్ నుండి అన్నపూర్ణ స్టూడియోస్ ఇన్‌వాల్వ్ అయింది. కానీ ఈ సినిమాకు అలా లేదు. క్రెడిట్ అంతా రాహుల్‌కే దక్కుతుంది. అందరూ కొత్తవాళ్లతో చేయడం అనేది రిస్కే. నిర్మాతలను అభినందించాలి. 

రైటర్స్ టైమ్...
- ఈ మధ్యన ఫ్రెష్ సబ్జెక్ట్స్ బాగా ఆడుతున్నాయి. స్టోరీ రైటర్స్, డైలాగ్ రైటర్స్ ఇలా రైటర్స్ అందరికీ టైమ్ వచ్చింది. తెలుగులో ‘మహానటి, రంగస్థలం’ చిత్రాల్లో ఆర్టిస్ట్ పెర్‌ఫార్‌వెున్స్‌లను పక్కన పెడితే.. మంచి రైటింగ్ కనపడింది. అలాగే.. ఈమధ్య హిందీ చిత్రాల్లో ‘రాజీ’ చూశాను. సబ్‌మెరైన్‌పై చేసిన ఆ స్పై ఫిలింలో సబ్‌మెరైన్‌ను చూపించకుండానే అద్భుతంగా తెరకెక్కించారంటే కారణం రైటింగే. రైటింగ్‌తో పాటు మంచి కాస్టింగ్ కూడా కుదిరింది. 

క్వాలిటీ ముఖ్యం...
- నేను బాలీవుడ్‌కి వెళ్లలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చారు. నేను బాలీవుడ్ సినిమా చేసి 15 ఏళ్లు అవుతుంది. మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. తమిళంలో కూడా అలాగే మంచి అవకాశం వచ్చిందని ‘ఊపిరి’ సినిమా చేశాను. మరో వారంలో నా తమిళ సినిమాకు సంబంధించి మరో అనౌన్స్‌మెంట్ చేస్తాను. అలా మంచి అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా ఇతర భాషా చిత్రాల్లో నటిస్తాను. అలాంటి సమయంలోనే అయాన్ ముఖర్జీ, కరణ్ జోహార్ వచ్చి అడిగారు. నాకు స్క్రిప్ట్ కాకుండా త్రీడీ వెర్షన్‌లో నా పాత్ర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే నేను చేస్తాను అని వారితో చెప్పాను. వాళ్లు మూడు నెలలు సమయం తీసుకుని త్రీడీ వెర్షన్ తయారు చేశారు. నా 15 నిమిషాల క్యారెక్టర్  నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అయాన్ ముఖర్జీ, కరణ్‌జోహార్, రణభీర్ కపూర్, అలియా వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పనిచేయడం ఎగ్జయిట్మెంట్‌గా అనిపించింది. ఇక అమితాబ్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బల్గేరియాలో ఓ వారం షూటింగ్ జరిగింది. 

తదుపరి చిత్రాలు...
- ‘దేవదాస్’ షూటింగ్ పది రోజులు మినహా మొత్తం పూర్తయింది. అందులో నా పేరు దేవ్.. నాని పేరు దాస్. దేవదాస్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. నాని చాలా టాలెంటెడ్ యాక్టర్. తనతో పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ కూడా చేసేస్తాం. ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించి కల్యాణ్ కృష్ణ, సత్యానంద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఏదీ కుదిరితే దాన్ని ముందుగా అనౌన్స్ చేస్తాను. 

Related News