bangalore

అనంత్‌ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు

Updated By ManamTue, 11/13/2018 - 17:32
Union Minister Ananth Kumar Cremated With Full State Honours

బెంగళూరు: ఊపిరితిత్తుల కేన్సర్‌తో కన్నుమూసిన కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.  అధికార లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు మంగళవారం బెంగళూరులో ముగిశాయి. అంత్యక్రియల కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు అనంత్‌కుమార్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 

కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కర్ణాటక బీజేపీ నేతలు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధపడుతున్న అనంత్ కుమార్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమ్నెస్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు

Updated By ManamThu, 10/25/2018 - 19:22
mnesty International Bengaluru Office Raided By ED

బెంగళూరు : ఎన్జీవో సంస్థ ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ (ప్రపంచ మానవ హక్కుల సంస్థ) కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం మధ్యాహ్నం దాడులు నిర్వహించింది. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న కార్యాయలంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

విదేశీ పెట్టుబడులకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆమ్నెస్టీపై ఆరోపణలు నేపథ్యంలో ఆ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఆగస్ట్‌లో ‘ది హిందూ’ దినపత్రికలో ఓ వార్త కూడా ప్రచురితమైంది.వారం కూడా గడవకముందే డిప్యూటీ మేయర్ హఠాన్మరణం

Updated By ManamFri, 10/05/2018 - 10:59

Ramila Umashankarబెంగళూరు: బెంగళూరు డిప్యూటీ మేయర్‌ రమీలా ఉమాశంకర్ మరణించారు. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు తీసుకొని వారం రోజులు కూడా గడవకముందే గుండెపోటుతో ఆమె మృతి చెందారు. దీంతో ఆమె మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ఆమె మరణంపై మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతికి వ్యక్తం చేశారు. గురువారం జరిగిన నమ్మ మెట్రో ఆవిష్కరణ కార్యక్రమంలో తనతో పాటు ఆమె కూడా ఉందని, అలాంటిది ఉదయానికే ఆమె మరణిందన్న వార్త తనను బాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏషియాలోనే అత్యుత్తమం బెంగళూరు

Updated By ManamWed, 09/19/2018 - 21:53
  • మొత్తం 16 నగరాల్లో 7వ స్థానంలో హైదరాబాద్

 Bangalore is the best in Asiaన్యూఢిల్లీ: టెక్నాలజీ కార్యకలాపాల ప్రారంభానికికానీ లేదా విస్తరణకుకానీ మొత్తం ఏషియాలో బెంగళూరు అత్యుత్తమమైన నగరమని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ‘ఏషియాలో ఉన్నత నగరాలు: టెక్నాలజీ రంగం’ పేరిట ఆ సంస్థ ఒక పరిశోధనా నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన, ప్రవర్థమాన మార్కెట్లలోని 16 నగరాల స్థితిగతులను పరిశీలించింది. సామాజిక-ఆర్థిక, ఆస్తి, మానవాంశాలకు సంబంధించి దాదాపు 50 పరామితులను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ కేంద్రాలుగా ఈ నగరాల ఆత్మనిర్భరతను ఈ నివేదిక నిర్ణయించింది. మొత్తం 16 నగరాల జాబితాలో హైదరాబాద్ 7వ స్థానంలో నిలవగా, 10వ స్థానంలో ముంబై, 11వ స్థానంలో ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం నిలిచాయి. ఏషియాలో టెక్నాలజీ ఆపరేషన్ల అంకురార్పణకు లేదా విస్తరణకు బెంగళూరు, సింగపూర్, షెన్‌జెన్‌లు ప్రీతిపాత్రమైన ప్రదేశాలుగా నిలిచాయి. ‘‘భారతదేశపు సిలికాన్ వ్యాలీగా ప్రాచుర్యం పొందిన బెంగళూరు టెక్నాలజీ సంస్థలకు ఏషియాలో నంబర్ 1 ఛాయిస్‌గా ఎంపికైంది’’ అని నివేదిక పేర్కొంది. బెంగళూరు శక్తి దాని సామాజిక-ఆర్థిక బలాలలో ఉంది. దాని సగటు వార్షిక జి.డి.పి వృద్ధి 2022 వరకు 9.6 శాతంగా ఉండవచ్చని అంచనా. అది దాన్ని ఏషియాలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా నిలుపుతోంది. విస్తృతమైన, గాఢమైన అనుభవంగల ప్రజ్ఞావంతుల నుంచి అది సహజంగానే ప్రయోజనం పొందుతోంది. 

‘‘జనాభాతో పోల్చుకుని చూస్తే సాపేక్షంగా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలలో కన్నా ఈ నగరం (బెంగళూ రు)లోనే ఉన్నత విద్యా సంస్థల సంఖ్య ఎక్కువ. సమాచా ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో నియమితుల య్యే అర్హత లున్నవారు 24 శాతం మంది ఉంటారు. దాంతో టెక్నాల జీ మొలక సంస్థలకు బెంగళూరు సహజ మైన చిరునామాగా పరిణమించింది. అక్కడి టెక్నాలజీ స్టార్టప్‌లు కడచిన మూడేళ్ళలో సగటున ఏటా 4 బిలియన్ డాలర్ల పెట్టుబ డులను ఆకర్షించాయి’’ అని కాలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జో వర్ఘీస్ చెప్పారు. టోక్యో తర్వాత ఎ గ్రేడ్ కార్యాలయ వసతి ప్రదేశం బెంగళూరులోనే ఎక్కువగా ఉంది. అది కూడా ఆ నగరానికి ఆధిక్యాన్ని కట్టబెడుతోంది. యాజ మాన్యాలకయ్యే వ్యయాలు తక్కువగా ఉన్నాయి. జీవన వ్యయానికి సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండే టాప్ నగరాల్లో బెంగళూరు ఒకటిగా ఉంది. ర్యాంకింగ్‌లో బెంగళూరు 68 శాతం స్కోరు చేసి, మొత్తం మీద మొదటి స్థానంలో నిలిచింది. బహుళంగా ఉన్న మైక్రోమార్కెట్లలో 141 మిలియన్ చదరపుటడుగుల గ్రేడ్ ఎ కార్యాలయ వసతితో అది టోక్యో తర్వాత, రెండవ పెద్ద అర్బన్ ఆఫీస్ మార్కెట్‌గా నిలిచింది. అయితే, వృద్ధి చెందడానికి ఉన్న సామర్థ్యంతో 59 శాతం స్కోరుతో హైదరాబాద్ ఏడవ స్థానంలో నిలిచింది. సామాజిక-ఆర్థిక అంశాల రీత్యా మాత్రం అది తక్కువ స్థాయిలోనే ఉంది. ప్రతిభా వంతులను అందివ్వగలగడంలో అది బెంగళూరుతో సరితూగేదిగా లేదు. కానీ, పన్ను రేట్లు, జీవన వ్యయం హైదరాబాద్‌లో తక్కువే. మాన వాంశాలలో అది అనేక ఇతర భారతీయ నగరాలకన్నా మెరుగైన స్థితిలో ఉంది. మొత్తంమీద స్కోర్లలో 67.9 శాతమే అత్యధికమైనదిగా నిలువగా, 53 శాతం కనిష్ఠమైనదిగా నిలిచింది.రహానే.. నువ్వు సూపర్

Updated By ManamSat, 06/16/2018 - 12:51

Ajinkya బెంగళూరు: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌ ట్రోపీని టీమిండియా సొంతం చేసుకొంది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు, ఫాలో ఆన్‌లోనూ 103 పరుగులకే ఆలౌట్ అయ్యి ఆఫ్ఘనిస్థాన్ ట్రోపీని చేజార్చుకుంది. దీంతో ఐదు రోజుల జరగాల్సిన మ్యాచ్ కాస్త రెండు రోజుల్లోనే పూర్తైంది. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్‌ అనంతరం ట్రోఫీ ప్రధానోత్సవంలో ఓ ఆసక్తికర సంఘటన క్రికెట్ అభిమానులను మెప్పించింది.

ట్రోఫీని అందుకొని భారత జట్టు ఫొటోలు తీసుకుంటుండగా.. తమ విజయోత్సవాల్లో భాగం కావాల్సింది ఆప్ఘన్ జట్టును ఆహ్వానించిన కెప్టెన్ రహానే తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రహానేపై పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

 పసికూన ‘అఫ్ఘాన్‌’ను ఆడేసుకున్నారు!

Updated By ManamFri, 06/15/2018 - 19:04
  • ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో 262 ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయం

  • భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 474 ఆలౌట్

  • అఫ్ఘానిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 109.. రెండో ఇన్నింగ్స్ 103

India vs Afghanistan, Bangalore, IND win by an innings and 262 runsబెంగళూరు: పసికూనను చేసి అఫ్ఘానిస్థాన్‌‌ను టీమిండియా ఆట ఆడేసుకుంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో రహానె సారథ్యంలో భారత్ విజయం సాధించింది. రెండో రోజు ఆటలో 262 పరుగుల ఇన్నింగ్స్‌తో అఫ్ఘానిస్థాన్‌‌పై భారత్ గెలిచింది. దీంతో ఐదు రోజులు జరగాల్సిన బెంగళూరు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి రోజు ఆటలో ఓపెనర్లు సెంచరీలతో అదరగొట్టేశారు. శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్ (105) విజృంభించి పరుగుల వరద పారించారు. కేఎల్ రాహుల్ (54), ఛతేశ్వర పుజారా (35), హార్దీక్ పాండ్యా (71) దూకుడుగా ఆడుతూ హఫ్ సెంచరీ నమోదు చేయడంతో భారత్ భారీ స్కోరు 474 పరుగులను సాధించింది. అఫ్ఘానిస్థాన్‌‌కు ఇది తొలి టెస్ట్ మ్యాచ్‌ కాగా, రెండు రోజలు పాటు సాగిన మ్యాచ్‌లో అప్ఘాన్ తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో (109) కుప్పకూలింది.

ఆ తరువాత 365పరుగులు వెనుకబడి ఫాలో ఆన్‌కు దిగి రెండో ఇన్నింగ్స్‌ ఆడిన అప్ఘాన్.. 38.4ఓవర్లలో (103) పరుగులకే చాపచుట్టేసింది. భారత్ బౌలర్ల ధాటికి క్రీజులో పసికూన అఫ్ఘానిస్థాన్‌ జట్టు ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. దాంతో రెండో రోజు ఆట పూర్తిగా ఆడకుండానే పేలవ ప్రదర్శనతో చేతులేత్తేసింది. అఫ్ఘానిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా తమ స్పిన్ మాయాజాలంతో పసికూన అప్ఘాన్‌ను (6/35)తో చిత్తుగా ఓడించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వరుణుడి ఆటంకం.. నిలిచిన ఆట

Updated By ManamThu, 06/14/2018 - 14:00

match బెంగళూరు: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం పడుతుంటంతో మ్యాచ్‌‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 45.1 ఓవర్లు ఆగిన భారత్ ఒక వికెట్ నష్టానికి 248 పరుగులు చేసింది. అందులో శిఖర్ సెంచరీ బాది కాసేపటికి ఔట్ అవ్వగా.. ఆ తరువాత మురళీ విజయ్, రాహుల్‌లు తమ పరుగులును కొనసాగిస్తున్నారు.


 

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Updated By ManamThu, 06/14/2018 - 09:55

india ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కొన్ని కారణాల వల్ల కోహ్లీ ఈ మ్యాచ్‌కు హాజరుకాలేకపోతుండటంతో రహానే కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఏ జట్టులో ఎవరు ఆడుతున్నారంటే..
భారత్: శిఖర్ ధావన్, మురళీ విజయ్, పుజారా, రహానే, లోకేశ్ రాహుల్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.

ఆఫ్ఘనిస్థాన్: మహమ్మద్ షెహజాద్, జావెద్ అహ్మది, రహ్మత్ షా, అజ్గర్ స్టానిక్ జై, అఫ్జర్ జజై, మహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, యామిన్ అహ్మద్ జై, వఫాదార్.

 నేటి సాయంత్రం బెంగళూరుకు కేసీఆర్

Updated By ManamTue, 05/22/2018 - 13:29

CM Kcr, HD Kumaraswamy sworn in, Bangalore హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి అందిన ఆహ్వానం మేరకు ఆయన ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు కొంతమంది పార్టీ నేతలు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆయన కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్‌ బెంగళూరు‌కు బయల్దేరి వెళ్లనున్నారు. కాగా, కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నట్టు సమాచారం.మరికాసేపట్లో దేవెగౌడతో కేసీఆర్ భేటీ..

Updated By ManamFri, 04/13/2018 - 12:04

Telangana CM KCR Tour in Bangalore

బెంగళూరు: ఫెడరల్ ఫ్రంట్ దిశగా ముందుకెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడతో భేటీ కానున్నారు. కాగా ఇప్పటికే ఫ్రంట్‌లో చేరే పార్టీలను, అధినేతలను కలిసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగాఇప్పటికే పలువుర్ని కలిసిన కేసీఆర్ తాజాగా మరో రూట్ మ్యాప్ తయారు చేశారు. శుక్రవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన కేసీఆర్ బృందం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు.

పర్యటనలో కేసీఆర్‌తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఉన్నారు. కాగా.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News