thailand

కొండచిలువతో చందమామ ఆటలు

Updated By ManamThu, 10/04/2018 - 12:29

Kajal Aggarwalకొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా టాలీవుడ్‌లో తన స్థానాన్ని మాత్రం పదిలంగా ఉంచుకుంది చందమామ కాజల్. టాప్ హీరోలు చాన్స్‌లు ఇవ్వనప్పటికీ, యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తుండటంతో వారితో ఆడిపాడుతోంది. కాగా కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా థాయ్‌లాండ్ వెళ్లిన కాజల్.. అక్కడ అందాలను చూసి ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు కొన్ని సాహసాలను కూడా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ కొండచిలువను తన మెడలో వేయించుకున్న కాజల్.. దానితో ఆటలాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి అభిమానులు వావ్ అంటూ కామెంట్ పెడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 ఆ 18 రోజులు ఎలా గడిపామంటే..!

Updated By ManamThu, 07/19/2018 - 11:55

Thailand థాయ్‌ల్యాండ్‌లోని థామ్ లువాంగ్‌లో గుహలో చిక్కుకుపోయిన 12మంది విద్యార్థులు, ఒక కోచ్ 18 రోజుల తరువాత ప్రాణాలతో భయటపడ్డ విషయం తెలిసిందే. వీరందరినీ హాస్పిటల్‌లో చేర్పించగా.. తాజాగా కోలుకున్నారు. ఈ నేపథ్యంతో వీరు మీడియాతో మాట్లాడుతూ.. ఆ చీకటి రోజులు ఎలా గడిపారో వెల్లడించారు. డైవర్లు తమను గుర్తించడం అద్భుతమేనని, అన్నీ రోజులు గుహలో ఉన్న రాళ్ల నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగామని, ఆహారం తీసుకోలేదని ఓ పిల్లాడు తన అనుభవాలను పంచుకున్నాడు. ఇసుకలోనే పడుకున్నామని, బుద్ధుడి ప్రార్థనలు చేశామని, టైంపాస్ కోసం చక్కర్స్ ఆడామని వారు తెలిపారు. ఇక ఎప్పుడూ తాము తిండి గురించి ఆలోచించలేదని, ఎందుకంటే అలా ఆలోచిస్తే ఆకలి మొదలవుతుందని భయపడేవాడినని మరో విద్యార్థి తన అనుభవాన్ని వెల్లడించాడు.

అనంతరం కోచ్ మాట్లాడుతూ గుహను తవ్వి పడాలనుకున్నామని, బయటి నుంచి సాయం వస్తుందని ఊహించలేదని అన్నారు. ఇక ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన థాయ్ నేవీ సీల్‌కు పిల్లలు నివాళి అర్పించారు. ఆఖర్లోనూ అంతే డేంజర్

Updated By ManamFri, 07/13/2018 - 01:06
  • విద్యార్థులు, కోచ్ సురక్షితంగా బయటకు.. కొన్ని నిమిషాల్లోనే ఆగిపోయిన మోటారు

thailandబ్యాంకాక్/మాసాయ్: థాయిలాండ్‌లోని థామ్ లువాంగ్ గుహ నుంచి 12 మంది విద్యార్థులను, కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. వారిని కాపాడిన డైవర్లు, సహాయక సిబ్బంది చివరి నిమిషంలో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత విద్యార్థులను, చివరగా కోచ్‌ను బయటకు తీశారు. కోచ్  బయటకు వచ్చిన కొన్ని కొద్దిసేపటికే.. గుహలో నీటిని తోడేందుకు ఉపయోగించిన మోటార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ సమయంలో గుహ లోపల 20 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. వారంతా ప్రవేశద్వారానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.  మోటార్లు ఫెయిలయ్యాయనే విషయాన్ని ఆస్ట్రేలియా డైవర్ గుర్తించి గట్టిగా అరిచాడని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న థాయిలాండ్ నేవీ సీల్‌కు చెందిన కమాండర్ చైయనంతా పీరనారంగ్ తెలిపారు. దాంతో హుటాహుటిన బయటకు వచ్చే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేశామని, చివరి డైవర్ బయటకు వచ్చేటప్పటికి అతని మెడ వరకు నీటి మట్టం పెరిగిందని అన్నారు. ఒక దశలో రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతంగా మారుతుందని భావించామని అన్నారు. విద్యార్థులను తీసుకురావడానికి ముందే పంపు గనుక పని చేయడం ఆగిపోతే పరిస్థితి మరోలా ఉండేదని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. విద్యార్థులను తరలించేటప్పుడు వారికి మత్తు మందు ఇచ్చామని, నీటిలో ఈదుతున్నప్పుడు వారు గాభరా పడకుండా ఉండేందుకే అలా చేశామని అన్నారు. విద్యార్థులను తీసుకువచ్చే సమయంలో కొందరు నిద్రపోయారన్నారు.తెరకెక్కనున్న ‘ఆపరేషన్ గుహ’

Updated By ManamThu, 07/12/2018 - 23:47
  • 400 కోట్లతో హాలీవుడ్ చిత్రం.. మ్యూజియంగా ‘థామ్ లువాంగ్’

thailandబ్యాంకాక్/మాసాయ్: థాయిలాండ్ గుహలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను సినిమా మలచేందుకు నిర్మాణ సంస్థలు తెగ పోటీ పడుతున్నాయి. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుమారు 60 మిలియన్ డాలర్ల ఖర్చుతో(దాదాపు 400 కోట్ల) సినిమా తీయాలని నిర్ణయించింది.  ఇందుకు  సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, నిర్మాతలు మైకేల్ స్కాట్, అడమ్ స్మిత్‌లు అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరు ‘గాడ్స్ నాట్ డెడ్’ సినిమాను నిర్మించారు. ఇక మరో దర్శకుడు ఎమ్ చూ కూడా ఈ థాయ్ ఆపరేషన్‌ను చిత్రంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ‘ఇదో అందమైన కథ. ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఆపరేషన్‌ను.. తెరపై చూపించటం గర్వంగా ఫీలవుతున్నా’ అని ఆయన ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఇవన్‌హోయే పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మరికొన్ని సంస్థలు కూడా సినిమా నిర్మాణంపై దృష్టి సారించాయి. కొన్ని సినిమాలు రెస్క్యూ ఆపరేషన్ కేంద్రంగా సినిమా తీస్తుండగా.. మరికొందరు టీమ్ కోచ్ పాత్ర నేపథ్యంలో సినిమా తీసేందుకు ఉద్యుక్తమవుతున్నాయి.

మ్యూజియంగా మారనున్న గుహ..
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతకు గురి చేసిన థాయిలాండ్ గుహను మ్యూజియంగా మార్చబోతున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు థాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఈ గుహలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు. థాయ్‌లాండ్ పర్యాటక ప్రాంతాల్లో ఈ గుహ ప్రత్యేకంగా నిలవనుందని ‘బీబీసీ’ వార్తా సంస్థ వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో అతి పెద్ద గుహల్లో ఈ థామ్ లువాంగ్ కూడా ఒకటి. అయితే దీనిని టూరిజం స్పాట్‌గా మార్చే ముందు అన్ని రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా స్పష్టంచేశారు.మరో నలుగురు విద్యార్థులు!

Updated By ManamMon, 07/09/2018 - 21:27
  • థాయిలాండ్ గుహ నుంచి వెలికితీత

  • మొత్తం 8 ఎనిమిది మంది బాహ్య ప్రపంచంలోకి..

imageబ్యాంకాక్: థాయిలాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. సోమవారం మరో నలుగురు విద్యార్థులను సహాయకబృందం బయటకు తీసుకువచ్చింది. దాంతో దాంతో గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. సోమవారం వాతావరణం అనుకూలించడంతొ నలుగురు విద్యార్థులను వెలికి తీసుకురాగలిగామని అధికారులు తెలిపారు.

ఆదివారంనాటి రెస్క్యూ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థులను బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 12 గంటలపాటు శ్రమించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు పిల్లల్ని గుహ నుంచి బయటకు తీసుకురాగలిగారు.

గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారుల్ని అధికారులు వెంటనే హెలికాప్టర్‌లో చియాంగ్ రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు.  దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌కు చెందిన వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టు కోచ్‌తో పాటు 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహను జూన్ 23న సందర్శించారు. వీరు గుహలోకి వెళ్లగానే భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రవేశమార్గం మూసుకుపోయిన విషయం తెలిసిందే.దెయ్యాల భయంతో థాయ్ గ్రామం

Updated By ManamThu, 03/01/2018 - 18:15
thailand ghost

థాయ్‌లాండ్‌లోని మారుమూల గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికీ అక్కడి ప్రజలు కొరివి దెయ్యాల భయంతో గజగజవణికిపోతున్నారు. గత కొన్ని వారాలుగా ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఓ పల్లెటూరులో ఐదుగురు యువకులు నిద్రలోనే హఠాన్మరణం చెందారు. పూర్తి ఆరోగ్యవంతులైన వీరు ఐదుగురూ...ఒకే రీతిలో మరణించడం ఆ గ్రామస్థులను భయపెడుతోంది. దీంతో నకోన్ ఫనోం అనే ఆ గ్రామ ప్రజలు దెయ్యాల భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన ఓ విధవ దెయ్యమై ఇలా ఒక్కో యువకుడి ఆత్మలను తన వెంట తీసుకెళ్తోందని గ్రామస్థులు నమ్ముతున్నారు.

thailand ghost

ఈ దెయ్యం బారినపడకుండా ఉండేందుకంటూ ఆ గ్రామంలోని మహిళలు...తమ భర్తల చేత రాత్రి పూట ఆడవారి వస్త్రాలను ధరింపజేస్తున్నారు. మరికొందరు రాత్రి పూట తమ భర్తలకు ఆడవారిలా మేకప్ వేసి అతి జాగ్రత్త పాటిస్తున్నారు. దయ్యం కన్నుగప్పేందుకే ఇదంతా అని చెబుతున్నారు. కొన్ని ఇళ్ల ఎదుట ఎరుపు వస్త్రాలు ధరించిన మగవాళ్ల దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి...వీటికి 80 సెంటీమీటర్ల పొడవైన పురుషాంగాన్ని పోలినట్లు కర్రలను అమర్చుతున్నారు. మరికొందరు తమ ఇంటి గోడలుకు ‘ఇంటిలో మగవాళ్లెవరూ లేరు’ అని రాస్తున్నారు.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత గత వారం రోజులుగా గ్రామంలోని యువకులందరూ క్షేమంగా ఉన్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. విధవ దెయ్యం పక్క గ్రామాలకు రావచ్చన్న ప్రచారం జరగడంతో ఆ గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ గ్రామాల్లోని ప్రజలు కూడా ఇదే తరహా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ghost

 ఏపీకి థాయ్ ఎయిర్‌వేస్ సేవలు

Updated By ManamWed, 02/07/2018 - 08:42

గన్నవరం నుంచి త్వరలో ప్రారంభం
అమరావతిలో బౌద్ధాలయ నిర్మాణం
సీఎంను కలిసిన థాయ్ ప్రతినిధులు
బౌద్ధ మందిరానికి పదెకరాల స్థలం
డిజైన్లు.. ప్రణాళికతో రండి: బాబు


Chandrababu, Thailandఅమరావతి:నవ్యాంధ్ర నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో ఇక్కడి నుంచి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు థాయ్ ఎయిర్‌వేస్ ముందుకొచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రతినిధులు ఈ మేరకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే విశాఖ లేదా విజయవాడ నుంచి త్వరలో సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని సూచించారు. మరోవైపు ఒకప్పుడు బౌద్ధారామాలతో విరాజిల్లిన అమరావతిలో తాము బౌద్ధ ఆలయం నిర్మిస్తామని ఈ సందర్భంగా థాయ్‌లాండ్ కౌన్సిల్ జనరల్ కాంగ్ కనీత్ ర క్చోరియన్ చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయంలోని బుద్ధిస్టు లెర్నింగ్ సెంటర్‌కు అనుసంధానంగా ఉంటూ బౌద్ధ ధర్మం, విశిష్టతలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపైనా సీఎం సానుకూలంగా స్పందించారు. అమరావతిలో పది ఎకరాల స్థలం కేటాయిస్తామని, ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, ఆకృతులతో రావాలని సూచించారు. భూలోక స్వర్గం.. థాయిలాండ్ ట్రిప్  

Updated By ManamSun, 09/17/2017 - 16:52

పర్యాటకుల స్వర్గధామం  థాయిల్యాండ్. ఎన్నోసుందర ప్రదే శాలు సందర్శకుల మదిని దోచేస్తాయి. అందుకే భారతీయ సినిమాల సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. మరి ఆ అందాలను చూడాలని అనుకుంటే పర్యటనకు ప్లాన్ చేసుకోండి...  

విమానయాన చార్జీలు, ఆహారం, వసతి చార్జీలు
చెన్నై నుంచి బ్యాంకాక్ (థాయిలాండ్ రాజధాని)కు విమానంలో చెక్కేయాలంటే ప్రారంభ టికెట్ చార్జీలు సుమారు 6వేల రూపాయల నుంచి ఉన్నాయి. అదే బెంగళూరు నుంచి అయితే 8,500 రూపాయలు, హైదరాబాద్ నుంచి అయితే 10,500 రూపాయల నుంచి ఉన్నాయి. బ్యాంకాక్ లో ట్యాక్సీ ల్లో ప్రయాణించాలంటే%ౌౌ%  ప్రారంభ చార్జీ 35 థాయ్ బాట్ (టీహెచ్ బీ). ఒక టీహెచ్ బీ భారతీయ కరెన్సీలో సుమారు రెండు రూపాయలు. ఒక కిలోమీ టర్ తర్వాత నుంచి పది కిలోమీటర్ల వరకు ప్రతీ కిలోమీటర్ కు 5.50 టీహెచ్ బీల చార్జీ వసూలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 20 కిలోమీటర్ల వరకు కిలోమీ టర్ కు 6.50 టీహెచ్ బీల చార్జీ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉంటుంది. ెటల్ ముందు కాకుండా కొంచెం పక్కకు వచ్చి ట్యాక్సీలను మాట్లాడుకోవడం నయం. మీటర్ వేస్తేనే వాహనం ఎక్కండి. లేదంటే ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. 

బ్యాంకాక్ లో పైన తీగల మార్గంలో (రోప్ వే) ప్రయాణించాలనుకునేవారికి బీటీ ఎస్ వ్యవస్థ ఉండనే ఉంది. ఇందులో తక్కువ చార్జీకే త్వరగా గమ్యస్థానానికి చేరు కోవచ్చు. అయితే, వీటిలో రష్ ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో రద్దీ తగ్గు తుంది. వీటిలో ప్రయాణ చార్జీలు 20 నుంచి 40 టీహెచ్ బీల మధ్యలో ఉంటాయి. బస్సుల్లో ప్రయాణ చార్జీలు 6.50 టీహెచ్ బీల నుంచి 20 టీహెచ్ బీల వరకు ఉంటాయి. ద్విచక్ర వాహన ట్యాక్సీలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. బ్యాంకాక్ కు వెలుపల బస్సు సర్వీసులు, రైల్, ట్యాక్సీ సేవలు సౌకర్యంగా ఉంటాయి. టెల్లో విడిది చార్జీల విషయానికొస్తే బడ్జెట్ ెటల్లో ఒక రోజుకు గాను చార్జీ 500 రూపాయల వరకు ఉంటుంది. స్టాండర్డ్ ెటల్స్ లో బస చేయాలంటే 700 రూపాయల నుంచి వ్యయమవుతుంది. భారతీయ ఆహారం కోరుకునే వారు వీధి పక్కన బండ్లపై లాగించేద్దామనుకుంటే చైనాటౌన్ సమీపంలోని పహురత్ కు వెళ్లాలి. లేదా భారతీయ జనాభా ఎక్కువగా ఉండే ప్రతునమ్ ప్రాంతానికి వెళ్లినా కోరుకున్న ఆహారం లభిస్తుంది. ఇక్కడ ఒక చపాతి 15 టీహెచ్ బీ, తందూరి రోటి 20 టీహెచ్ బీ, అలూ పరాటా 50 టీహెచ్ బీ, చికెన్ పరాటా 130 టీహెచ్ బీల ధరల్లో ఉన్నాయి. ప్లెయిన్ రైస్ ధర 30 టీహెచ్ బీలు కాగా, వెజిటబుల్ కర్రీ తీసుకోవాలంటే 110 టీహెచ్ బీలు చెల్లించాలి. పప్పు ఒకటి చాలనుకుంటే 60 టీహెచ్ బీలు. 

టూర్ ప్యాకేజీలు
రూ.27,668 రూపాయల యాత్రా సంస్థ ప్యాకేజీతో థాయిల్యాండ్ లోని బ్యాంకాక్, పట్టాయా నగరాలను చూసి రావచ్చు. ఐదు రోజుల పర్యటనలో రెండు రాత్రులు పట్టాయాలో, రెండు రాత్రులు బ్యాంకాక్ లో విడిది. రానుపోను విమానయానం, బ్రేక్ ఫాస్ట్ ఉచితం. జీఎస్టీ 3.6 శాతం అదనం. ఇక ఫుకెట్, బ్యాంకాక్ పర్యటనల ప్యాకేజీ ధర రూ.51,990. ఇదే ప్యాకేజీని థామస్ కుక్ 46,500 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. ఫుకెట్, క్రాబి, బ్యాంకాక్ ల ప్యాకేజీని 54,500 రూపాయలకు అందిస్తోంది. పట్టాయా, బ్యాంకాక్ ల పర్యటన వరకే అయితే, 27,925 రూపాయలకు అందిస్తోంది. మేక్ మై ట్రిప్ ఇదే తరహా టూర్ ప్యాకేజీకి 33,990 చార్జ్ చేస్తోంది. ఈ ప్యాకేజీల్లో భాగంగా టూరిజం సంస్థలు అన్ని ప్రదేశాలను చూపించవు. రోజులో కేవలం ఒక పూట మాత్రమే పరిమిత సందర్శనకు తీసుకెళతాయి. కాబట్టి ముందుగానే టూర్ లో భాగంగా ఏమి చూడాలన్న విషయమై ప్లాన్ తో  ఉంటే మంచిది. 

సందర్శనీయ స్థలాలు
క్రాబి ప్రావిన్స్ లో ఉన్న ఫిఫి ద్వీప సమూహం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతం. ఇక్కడ తరచూ సినిమా షూటింగు లు జరుగుతుంటాయి. పాంగ్ ఎన్జీయే ఇది ఫుకెట్ ఐలాండ్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిల్యాండ్ లోని  అత్యదుేతమైన సుందర ప్రదేశం. సముద్రం మధ్యలో చిన్న చిన్న కొండలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూసి ఉంటారు. ఇక ప్రత్యక్షంగా చూస్తే... ఆ ఆనందమే వేరు! గ్రాండ్ ప్యాలస్.. బ్యాంకాక్ లో ఉన్న ఈ రాజ ప్రాసాదం చావో నది ఒడ్డున సుందర మైన నిర్మాణ శైలితో అపురూపంగా ఉంటుంది. 

ముకోచాంగ్ నేషనల్ పార్క్ మొత్తం 50 ద్వీపాల్లో విస్తరించి ఉంది. కొండలు, అటవీ ప్రాంతంతో మరోవైపు సాగరుడి అందాలతో చూడచక్కగా అనిపిస్తుంది. థాయిల్యాండ్-బర్మా డెత్ రైల్వే... కాంచనబురి నుంచి క్వాయ్ నది వంతెన మీదుగా నామ్ టోక్ వరకు రెండు గంటల ప్రయాణం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది.  కో ఫాంగాన్ ద్వీపంలోని హాడ్ రిన్ ప్రాంతంలో ప్రతి నెలా పున్నమి నాడు ఫుల్ మూన్ పార్టీ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ఈ పార్టీకి సుమారు 30 వేల మంది వరకు హాజరవుతుంటారు. సూర్య దేవాలయం వాట్ అరుణ్ చూడకుండా థాయిల్యాండ్ పర్యటన సంపూర్ణం కాదు. చూడచక్కని నిర్మాణ నైపుణ్యం ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. చావో ఫ్రాయ నది ఒడ్డున బ్యాంకాక్ లో ఉందీ ఆలయం. దీని ఎత్తు 280 అడుగులు. 

ఖావో సాక్ నేషనల్ పార్క్ సహజసిద్ధమైన సౌందర్యంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. ప్రపంచంలో 5 శాతం జంతు జాతులకు ఇది ఆవాసంగా వర్ధిల్లుతోంది.  బ్యాంకాంక్ లో చాతుచాక్ వీకెండ్ మార్కెట్ ను ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు సంతగా చెబుతుంటారు. సుమారు 8వేల స్టాళ్లు కొలువు దీరతాయి. ప్రతీవారం సుమారు 2 లక్షల మంది షాపింగ్ చేస్తుంటారు.  చియాంగ్ మాయ్ పట్టణంలోని అతిపెద్ద నైట్ బజార్ కూడా పర్యాటకులను ఆకర్షించే వాటిలో ఒకటి. థాయిల్యాండ్ లో బౌల్ ఆఫ్ గోల్డ్ అనే పార్క్ ను కూడా తప్పక సందర్శించాలి. 42 చిన్న చిన్న దీవులు పక్క పక్కనే విసిరేసిన రాళ్లలా విస్తరించి ఉంటాయి. వీటిలో పర్యాటకుల విడిదికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.

11, 12వ శతాబ్ద కాలంలో కెమెర్ రాజ్యంలో నిర్మించిన ఆలయాలు నాటి చరిత్రకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇక్కడ హిందూ దేవతల శిల్పాలు దర్శనమిస్తాయి. బ్యాంకాక్ సిటీకి వెలుపల ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ల సందర్శన కూడా మరపురానిదే. నీళ్లలో పడవల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం అదో ప్రత్యేక అనుభవం, అనుభూతి! 

ఎరవణ్ నేషనల్ పార్క్ లోని ఎరవణ్ జలపాతాలు మంత్రముగ్ధులను చేసేస్తాయి. హిందూ పురాణాల్లోని మూడు తలల తెల్ల ఏనుగు పేరు ఈ జలపాతాలకు స్థిరపడింది. ఐరావతాన్ని థాయ్ భాషలో ఎరవణ్ గా పిలుస్తారు. 

Related News