Chicken rats

కత్తుల సమరానికి సంకెళ్లు పడేనా?

మన దగ్గరే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కోడిపందేలు నిర్వహిస్తుంటారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ రాజకీయ నాయకులు, మాఫియా ముఠాలు ఈ పందేలను నిర్వహించడం విశేషం. ఫిలిప్పీన్స్‌లో పండగలతో సంబంధం లేకుండా మామూలు రోజుల్లో కూడా కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తూనే ఉంటారు. పందెం జరిగే ప్రాంతాన్ని మన రాష్ట్రంలో బరి అంటారు. ఫిలిప్పీన్స్‌లో అరెంటా కొలీజియం అంటారు. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్‌లో సింధ్, ముల్తాన్, బెలుచిస్తాన్ ప్రాంతాల్లోనూ కోడిపందేలు భారీగా సాగుతాయి. స్పెయిన్‌లో కానరి ద్వీపాలలో కోడిపందేలు సాగుతాయి.

సంబంధిత వార్తలు