Soccer village of the world cup

రష్యా రంగస్థలం

Updated By ManamWed, 06/13/2018 - 23:03
  • నేటి నుంచే ప్రపంచకప్ సాకర్ సంగ్రామం

 Soccer village of the world cupమాస్కో: ఈ ప్రపంచ కప్‌లో ఆడే 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లుంటాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్ చేరతాయి. జులై 15న మాస్కోలోని లుజ్నికి స్టేడి యంలో ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఫుట్‌బాల్ సంబరం ముగుస్తుంది.  ఈ వరల్డ్‌కప్‌లో డి ఫెండిగ్ చాంపియన్ జర్మనీతో పాటు మాజీ విజేత  బ్రెజిల్ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, ఫ్రాన్స్‌లాంటి పెద్ద జట్లతో పాటు చిన్న జట్లు కూడా సంచలనాలు సాధించేందుకు సై అంటున్నాయి. 

అదిరిపోయేలా ప్రారంభ వేడుకలు
ఈ ప్రపంచ కప్ ప్రారంభ వేడులకను అదిరిపోయేలా నిర్వహించేందుకు రష్యా భారీ ఏర్పాట్లు చేస్తోంది.  మాస్కోలో నిర్మించిన లుజ్నికి స్టేడియంలో తొలి మ్యాచ్‌కు  అరగంట ముందు ఆరంభ  వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. వివిధ దేశాధినేతలు, ఫుట్‌బాల్ దిగ్గజాల సమక్షంలో దాదాపు 500 మంది స్థానిక కళాకారులతో ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో డాన్సర్లు, జిమ్నాస్ట్‌లు, విభిన్న రకాల  కళాకారులు అలరించబోతున్నారు.  జెన్నిఫర్ లోపెజ్-పిట్‌బుల్ నృత్యం ఆకట్టుకోబోతోంది. ఈ వేడులకు దాదాపు 80 వేల మంది హాజరవుతారని అంచనా .  ప్రఖ్యాత సంగీత కళాకారుడు రాబీ విలియమ్స్ తో పాటు రష్యాన్ స్టార అయిడా గరిఫుల్లీనా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. బ్రెజిల్ ప్రతినిధిగా మాజీ స్టార్ రొనాల్డో వేదికపై అలరించబోతున్నాడు. వారితో పాటు విల్‌స్మిత్ నిక్కీజామ్‌లు కలసి  ఫిఫా సాంప్రదాయ గీతం ‘లివ్ ఇట్ అప్’ను ఆలపిస్తారు. తమ దేశం ఆడే తొలి మ్యాచ్‌ను చూసేందుకు సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రత్యేక అథిగా హాజరుకానున్నారు.

భారీ ప్రైజ్‌మనీ గోల్డెన్ బూట్ ఎవరిదో..
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డును ప్రకటించటం 1930 నుంచి కొనసాగుతూ వస్తోంది.  ప్రతిష్ఠాత్మకంగా  భావించేఈ  గోల్డెన్ బూట్ దక్కించుకునేందుకు చాలా మంది ఆట గాళ్లు రేస్‌లో ఉన్నా... మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ పేర్లే అధికంగా వినిపనిస్తున్నాయి. 2014లో ఈ గోల్డెన్‌బూట్‌ను కొలంబియా ఆటగాడు జేమ్స్ రోడ్రిగజ్ దక్కించుకున్నాడు. గోల్డెన్‌బాల్, బెస్ట్ యంగ్ ప్లేయర్ లాంటి అవార్డులు చాలా ఉన్నా గోల్డెన్‌బూట్ ఎవరికి దక్కుతుందా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారు. ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకొనే... సమ్మోహన క్రీడ మనల్ని మైమరిపించేందుకు మనముందుకు వచ్చేసింది. నెల రోజులకు పైగా జరిగే సాకర్ సమరం మరికాసేపట్లో మొదలు కాబోతోంది. ఈ సాకర్ సమరంలో జర్మనీ మరో సారి చాంపియన్ అవుతుందా..? బ్రెజిల్ మళ్లీ జిగేల్ మంటుందా? ఫ్రాన్స్, ఇంగ్లండ్, సెయిన్, పోర్చుగల్ అద్భుతాలు సృష్టిస్తాయా ?. చిన్నదేశాలు సంచనం సృష్టించబోతున్నాయా ? అన్న సందేహాలకు ఈ రష్యా యుద్ధంలో సమాధానం దొరుకుతుంది.  

పోటెత్తిన అభిమానులు
కజన్:  ఫిఫా ప్రపంచకప్-2018 సందడి రష్యాలోనే కాకుండా ప్రపంచమంతా విస్తరించిం ది. ఫిఫా ప్రపంచకప్‌కు అతిథ్యమిస్తున్న రష్యాకు అభిమానులు భారీగా తరలివచ్చారు. గురువారం మాస్కోలో ప్రారంభం కాబోయే ప్రపంచకప్ మొదటి మ్యాచ్ కు వివిధ ప్రాంతాల నుంచి ఫుట్‌బాల్ అభిమానులు ఉత్సాహముగా రష్యాకు మంగళవారమే వచ్చేశారు. మొట్టమొదటి సారిగా రష్యా లో జూన్14 నుంచి జులై 15 వరకు ఈ మహాసంగ్రామం జరగుతుండటంతో ఫుట్‌బాల్ అభిమానులు ఫుట్‌బాల్ స్టార్ ఆటగాళ్లు మెస్సీ, నెయ్‌మార్ పేర్లతో జపం చేస్తున్నారు. ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ రష్యా, సౌదీఅరేబియా జట్ల మధ్య లుజ్నికి స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో సుమారు 80,000 మంది ప్రేక్షకులు ఆటను తిలకించవచ్చు. సౌత్‌అవెురికన్స్ అభిమానులు తమ జట్టుకు మద్దతుగా వారం నుంచి డ్రమ్స్, ఈలలుతో రష్యాలోని విధులు వెంట తిరుగుతూ సందడి చేస్తున్నారు. సౌత్ అవెురికన్స్‌కు ధీటుగా రష్యాలోని స్థానిక అభిమానులు రష్యా జెండాలు ధరించి, ‘‘రష్యా రష్యా’’ అని నగరాలు దద్దరిల్లేలా సందడి చేస్తున్నారు. అసలైన ఉత్సాహం రష్యాలో కంటే బయట ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించింది. కజన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డచ్ ఆటగాళ్లను చూసేందుకు 3,200 మంది ఆస్ట్రేలియా అభిమానులు కజన్ వచ్చారు. సెలవు దినం కావడంతో ఆస్ట్రేలియా అభిమానులు తమ ఆటగాళ్లకు మద్దతు తెలిపే అవకాశం లభించింది. ‘కజన్‌లో అభిమానులంద రినీ చూడటం, వారి మద్దతు మేము పొందడం చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు అనుకోలేదు’ అని ఆస్ట్రేలియా డిఫెండర్ జోస్ రిస్‌డాన్ చెప్పాడు. గ్రూప్-సిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శనివారం ఫ్రాన్స్‌తో తలపడనుంది. బ్రెజిల్ జట్టుకు మద్దతుగా అభిమానులు పెద్ద సంఖ్యలో సోచికు తరలి వచ్చారు.  సెయింట్‌పీటర్స్‌బర్గ్ బయట అభిమానులు క్రోయేుషియాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆనందంతో రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్ లుకా మోడ్రిక్ (క్రోయేుషియా) యువకులకు పాస్‌లను పంచిపెట్టాడు. ‘ ఈ ప్రపంచకప్ సందడిగా, భావోద్వేగాలతో నిండి ఉండాలి’ అని రష్యా అధ్యక్షడు పుతిన్ అన్నారు.

మాస్కోలో మెస్సీ మానియా
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్-2018 వేడి రష్యా అంతటా విస్తరించింది. ముఖ్యంగా మాస్కో నగరం మెస్సీ మానియా కొనసాగుతోంది. మెస్సీ ధరించే బ్లూ, వైట్ జెర్సీతో, వెనక 10వ నంబర్‌లో రష్యాలోని అర్జెంటీనా అభిమానులో మాస్కోలోని వీధుల్లో, స్క్వయర్స్ వద్ద హల్ చల్ చేస్తున్నారు. అర్జెంటీనా 1993లో వరల్డ్ కప్ గెలిచింది. కోపా అమెరికా టోర్నీలో ఫైనల్లో మెక్సికోను ఓడించి అర్జెంటీనా టైటిల్ సొంతం చేసుకుంది. చిన్న దేశమైన అర్జెంటీనా నుంచి డీగో మారడోనా వచ్చాడు. ఇప్పడు లియోనెల్ మెస్సీ కూడా మెస్మరైజ్ చేస్తున్నాడు. ‘అర్కెంటీనా.. అర్కెంటీనా.. మెస్సీ.. మెస్సీ’ అంటూ మాస్కోలోని ప్రముఖ రెడ్ స్క్వయర్ వద్ద అభిమానులు గట్టిగా అరుస్తూ తమ జట్టుకు మద్దతు తెలిపారు. ‘ఇక్కడి వాతావరణం ఒక్కసారి అద్భుతంగా మారిపోయింది. మా జట్టుకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాం. ఈసారి మా జట్టు (అర్జెంటీనా) టైటిల్ గెలుస్తుందన్న నమ్మకముంది’ అని బ్యూనోస్ ఎయిర్స్ నుంచి వచ్చిన ఓ అభిమాని చెప్పాడు. 2014లో అర్జెంటీనా జట్టు ట్రోఫీని గెలవకపోవడంతో అభిమానులు ఈ నాలుగేళ్లూ ఆ బాధను భరిస్తూ వచ్చారు. ఈసారైనా ఆ బాధ తీరుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. 

3 దేశాల్లో 2026 ప్రపంచ కప్
2026 ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చేఅవకాశం ఉత్తర  అమెరికా దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో దక్కించుకున్నాయి.  2006 ప్రపంచ కప్ నిర్వహణ కోసం ఈ మూడు దేశాలు కలిపి సంయుక్తంగా బిడ్ దాఖలు చేశాయి. బుధవారం మాస్కోలో జరిగిన సమావేశంలో మొరాకోను వెనక్కి నెట్టి ఈ మూడు దేశాలు ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్నాయి.

Related News