కరోనాతో హైరానా ప‌డుతుంటే.. ఆర్జీవీ కాంట్రవర్సీ ట్వీట్లు..!

ram gopal verma controversy tweets

వివాదాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన ద‌ర్శ‌కుడు రామ్ గోప‌ల్ వ‌ర్మ‌, మ‌రోసారి వివాదాస్పద ట్వీట్ల‌తో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. అస‌లు క‌రోనా దెబ్బ‌కి దేశ‌మంతా లాక్‌డౌన్ సాగుతుంటే.. ఆర్జీవీ వివాదాస్ప‌ద పోస్టుల‌కు మాత్రం లాక్ ప‌డ‌డంలేదు. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పై చేసిన వ్యాఖ్య‌లు ర‌చ్చ లేపుతున్నాయి. 

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. లాక్‌డౌన్ కార‌ణం ప్ర‌స్తుతం తండ్రీ, కొడుకులు (చంద్ర‌బాబు అండ్ లోకేష్) ఇద్ద‌రూ ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు కాబ‌ట్టి,  తాను తీసిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాని చూడాల‌ని వ‌ర్మ‌ పోస్టు పెట్టాడు. ఆ సినిమాలో చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా సీన్లు ఉన్నాయని, అప్ప‌ట్లో టీడీపీ త‌మ్ముళ్ళు పెద్ద ఎత్తున ర‌గ‌డ చేశారు. అయితే ఇప్పుడు క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో, తండ్రీ కొడుకుని ఆ సినిమా చూడ‌మ‌ని వ‌ర్మ కోరడంతో సోష‌ల్ మీడియాలో పెద్ద వివాద‌మే చెల‌రేగుతోంది. మ‌రి వ‌ర్మ పోస్టుకి టీడీపీ త‌మ్ముళ్ళ‌ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.