ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం.. లాక్‌డౌన్ రూల్స్ మార్చిన జ‌గ‌న్..!

Jagan who changed Lockdown Rules 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ రూల్స్ మ‌రింత క‌ఠిన‌మవుతున్నాయి. సామాజిక దూరం పాటించాల‌ని ఎంత విజ్ఞ‌ప్తి చేసినా, గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావొద్దిన హెచ్చ‌రించినా జ‌నాలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఒక‌వైపు కరోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ప్ర‌భుత్వం నిరంత‌రం పోరాడుతుంటే, ప్ర‌జ‌లు మాత్రం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, తాజాగా అధికారుల‌తో ఏర్పాటు చేసిన ఉన్న‌త స్థాయి స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

ఇలాంటి భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తుండ‌డంతో సీరియ‌స్ అయిన జ‌గ‌న్ లాక్‌డౌన్ రూల్స్ మార్చారు. ఇంత‌క‌ముందు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలుకు ఉద‌యం 6 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు. అయితే ఎక్కువ మంది ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం కార‌ణంగా, ఇప్పుడు 6 గంట‌ల నుండి 11 గంట‌లు వ‌ర‌కు మాత్రమే ప్ర‌జ‌ల‌ను రోడ్ల పైకి అనుమ‌తి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెంచితే వ్యాపారుల పై క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు.