కమల్ తో జోడీ కట్టనున్న జేజమ్మ 

anushka will pair with kamal

లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న అనుష్క, సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. బాహుబలి-2 వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోతుంది. కానీ అనుష్క నుండి వచ్చిన మూవీ ఒక్క భాగమతి మాత్రమే. అనుష్క తదుపరి చిత్రం నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే మూడేళ్ళలో అనుష్క చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అలా అని స్వీటీ కి ఆఫర్ల కొరత లేదు. చిరు సరసన ఆచార్యలో కూడా అనుష్కకు అవకాశం వచ్చింది. కానీ తమిళ్ లో ఒక మూవీ ఒప్పుకున్నందుకు ఈ సినిమాను వదులుకుందంట. ప్రస్తుతం అనుష్క, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమా తెలుగు తమిళ్ లో రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా తరువాత మళ్ళీ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లోనే అనుష్క నటించనుంది. గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కలయికలో వచ్చిన రాఘవన్ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. మళ్ళీ కమల్ గౌతమ్  మీనన్  కాంబినేషన్ లోనే రాబోతున్న రాఘవన్ 2 లో అనుష్క కథానాయికగా నటిస్తుంది.