వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దు : క‌న్న‌బాబు

వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దు : క‌న్న‌బాబు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీల రాకపోకలను నిరాకరించవద్దని సీఎం ఆదేశించారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ... వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా గిట్టుబాటు ధరలు అందించేలా చర్యలు ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం స్పష్టం చేశారని, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ ధరకు అమ్మితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యలు లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, ఎంపెడాతో కలిసి రొయ్యల కొనుగోలుకు నిర్ణయించిన ధరకు కొనాలని స్పష్టం చేశారు.​ ఆక్వా రంగంలో 50 శాతం మంది కూలీలను అనుమతించాలని తెలిపారు.