రాజ‌స్థాన్ లో పడవ మునక : ఆరుగురు మృతి

రాజ‌స్థాన్ లో పడవ మునక : ఆరుగురు మృతి

న‌దిలో ప‌డ‌వ మునిగి ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రికొంత మంది గ‌ల్లంతైన విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.  రాజస్థాన్‌ కోటాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్‌ నది వద్ద ఘోరం జరిగింది. 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. బాధితులంతా బుండి జిల్లాలోని కమలేశ్వర మహాదేవ్‌ దేవాలయా నికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.