ల‌క్ష కోట్ల వ్య‌వ‌సాయ నిధిని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

ల‌క్ష కోట్ల వ్య‌వ‌సాయ నిధిని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

పంటల సీజన్ వేళ దేశంలోని పేద రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ అండగా నిలిచారు. పీఎం కిసాన్‌ పథకం కింద ఆరో విడుత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేశారు.దేశంలోని రైతులను దృష్టిలో ఉంచుకుని రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థికసాయం అందించనుంది కేంద్రం. సదుపాయాల కల్పనకు రూ. లక్ష కోట్లు మంజూరు చేయనుంది. ఇందుకోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్ర వ్యవసాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు ప్రారంభించిన ఈ ప్రత్యేక నిధి ద్వారా రైతులు సొంతంగా తమ గ్రామాల్లోనే పంటలను నిల్వచేయడానికి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతారని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.