తెలంగాణలో కొత్తగా 1,982 కరోనా కేసులు 

తెలంగాణలో కొత్తగా 1,982 కరోనా కేసులు 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభ‌ణ‌ కొనసాగుతోంది. గ‌త కొన్ని రోజులుగా భారీస్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.  టెస్టులు పెంచేకొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 1982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79,495కి చేరింది. మరో 12 మంది కొవిడ్‌తో మృతి చెందడంతో.. ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 627కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలో 463 పాజిటివ్‌ కేసులు, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, జోగులాంబ గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన‌ట్లు వెల్ల‌డించింది. తాజాగా 1,669 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 55,999కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 16,112 మంది హోమ్‌‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.