తెలంగాణ పోరడుతో గుంటూరు సినిమా

ANAND DEVARAKONDA DO A FILM IN GUNTUR BACKGROUND

ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'. ఈ చిత్రంతో వినోద్‌ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెనిగళ్ళ ఆనందప్రసాద్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''గుంటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఇందులో పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడతాయి. వేసవికి విడుదల చేయాలనుకున్నాం. లాక్‌డౌన్‌ వల్ల కుదరలేదు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని చెప్పారు. ''ఆనంద్‌ తొలి సినిమాకు పూర్తి భిన్నమైన చిత్రమిది. సున్నితమైన ప్రేమకథతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
స్వీకర్‌ ఆగస్తి చక్కని బాణీలు అందించారు'' అని దర్శకుడు అన్నారు.