నాగచైతన్యతో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ

NAGACHAITANYA ACT IN INDRAGANTI'S MOVIE

ఆహ్లాదకరమైన సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి. వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నారు హీరో నాగచైతన్య. తాజాగా వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో వినూత్నమైన ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పిన కథ నచ్చడంతో నాగచైతన్య ఈ సినిమా చేయడానికి సముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ సినిమా చేస్తున్నారు నాగచైతన్య.