'షాడో' లో రానా, అల్లరి నరే​శ్?

RANA AND ALLARI NARESH ACT IN SHADOW

 ఇప్పటికీ థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో అర్థం అవ్వడం లేదు. దీంతో నిర్మాతలు ఓటీటీలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణసంస్థ ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ ఓ వెబ్​సిరీస్​ను రూపొందించబోతోంది. రచయిత మధు బాబు రాసిన షాడో నవల ఆధారంగా 'షాడో' అనే వెబ్​సిరీస్​ను నిర్మించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
ఈ వెబ్​సిరీస్​లో రెండు కీలక పాత్రల కోసం రానా దగ్గుపాటి, అల్లరి నరే​శ్ లను నిర్మాణ సంస్థ సంప్రదించిందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చార లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రి-ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.