షాబాద్ సీఐ, ఏఎస్సై లకు 14 రోజుల రిమాండ్

SHABAD CI, ASI GO TO REMAND

షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఉస్మానియా ఆసుపత్రిలో సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిద్దరినీ అనిశా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్యకు సంబంధించి భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. రెండు ఇళ్లు, 11 ఇళ్ల స్థలాలు, బంగారు ఆభరణాలు, 41 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.17.88లక్షల నగదు సహా రూ.3.58 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అనిశా వర్గాలు తెలిపాయి. లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలను అనిశా అధికారులు గుర్తించారు.
ఇవాళ ఎల్బీనగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.