ఈ హత్యలు చేసింది చంద్రబాబే

Updated By ManamWed, 05/16/2018 - 15:57
YS Jagan Fired On Chandrababu Naidu
  • ముఖ్యమంత్రిపై హత్యకేసు పెట్టాలి.. గోదావరి పడవ ప్రమాదంపై జగన్ ఆగ్రహం

  • మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్

YS Jagan Fired On Chandrababu Naiduదేవీపట్నం: గోదావరి నదిలో లాంచీ మునిగిన దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆరు నెలల్లో ఇది మూడో ప్రమాదమని, చాలా బోట్లకు లైసెన్సులే లేవని అధికారులు చెబుతున్నా వాటిని ఎలా తిరగనిస్తున్నారని ఏపీ ప్రభుత్వా్న్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హత్యలేనని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై హత్యకేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరుసగా పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలేవీ తీసుకోకుండా నిద్రపోతోందా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకూ లంచాలు తీసుకోబట్టే ప్రజలకు అందించాల్సిన వసతులపై అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ఘటననూ ఆయన ప్రస్తావించారు. సినిమా షూటింగ్ వంటి చంద్రబాబు ఆర్భాటాల వల్లే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 21 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తొక్కిసలాటకు సంబంధించిన విచారణనూ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై విచారణ జరిగితే తప్పు తనదేనని తేలుతుందన్న భయంతో విచారణ జరిపించట్లేదన్నారు. కాగా, పడవ ప్రమాదం జరిగిన ప్రాంతంలో వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని జగన్ చెప్పారు. 

English Title
YS Jagan Fired On Chandrababu Naidu




Related News