అతిశయం ఎందుకో?

tdp

తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకుని నేటి ప్రధాని మోదీ వరకు దేశాన్ని ఎందరెందరో ప్రధానులు పాలించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రజాస్వామిక విలువలు పాదు కొల్పడానికి నెహ్రూ చేసిన కృషి మరువలేనిది. ప్రశ్నించే బల మైన ప్రతిపక్షాలు లేకున్నా, అవధులు లేని అధికారం అనుభ వించే అవకాశం ఉన్నా ఆయన ఏనాడు నియంతగా వ్యవహ రించలేదు. అప్పుడప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త ఉత్సా హాన్ని ప్రదర్శించినా ఆయన తగురీతిలో నియంత్రించేవా రు. ఈ మధ్య తనను విమర్శిస్తూ కార్టూన్‌లు వెయ్యడం తగ్గించడం ఏమీ బాగోలేదని, మీరు వేసే కార్టూన్స్ నేను చేసే తప్పుల్ని ఎత్తిచూపడం వల్ల వాటిని సరిచేసుకునే అవ కాశం ఉంటుందని ఆయన ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్‌కు రాసిన లేఖ జగత్ప్రసిద్ధం. ఆయన తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి సైతం దేశంలో ప్రజాస్వామిక విలువలు బలోపేతం కావడానికి ఇతోధికంగా కృషిచేశారు. ఇక ఆయన మరణం తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ ఆదిలో అమాయకంగా కనబడినా రానురాను బలపడి వ్యవస్థలన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకున్న విధానా న్ని సైతం ఈ దేశం చవిచూసింది. ఆమె నియంతృత్వ పోకడల వల్లే దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం  ఏర్పడింది. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి ఆమె దేశం నెత్తి మీద రుద్దిన ఎమెర్జెన్సీని నేటికీ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కూడా ఇందిర కక్షసాధింపుతోనే వ్యవహరించేవారు. ఇందిర తరువాత అంతటి నియంతృత్వ పోకడలు కల్గిన ప్రధానిగా నేడు మోదీ పేరు తెచ్చుకుంటున్నారు. ఇందిర, మోదీల మధ్య ఉన్న మరో సారూప్యత ఏమిటంటే ఇద్దరు నేతలు ప్రజాబాహుళ్యంలో అంతులేని అభిమానం కలవారే. అంతేకాదు ఇరువురు నేతలకు సమకాలీనంగా సరైన ప్రత్య ర్థులుగా నిలబడగల్గిన ప్రజానేతలు ప్రతిపక్షాల్లో లేకపోవడం కూడా విచిత్రం.  ఇది కూడా వారిలో నియంతృత్వ పోకడలు పెంపొందడానికి కారణం అనిపిస్తుంది.

నిజానికి గడచిన ఏడూ శతాబ్దాలలోనూ ఏ ప్రధానిపైనా పెట్టుకోనన్ని ఆశలు ఈ ప్రజలు మోదీపై పెట్టుకున్నారు. దాన్ని ఆయన బాధ్యతాయుతంగా భావించి ఉంటే వర్త మానం మరోలా ఉండేది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా మోదీ సరికొత్త విధానాల్ని దేశం యవనికపై ఆవిష్కరిస్తారని యువత అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండి యా వంటి పథకాలతో తొలుత మోదీ అటువంటి ప్రయ త్నాలు చేసినా రానురాను ఆయన దేశ అభివృద్ధి లక్ష్యాలపై నుంచి కేవలం రాజకీయ లక్ష్యాలపైకే దృష్టిని మళ్ళించడంతో అవన్నీ మూలనపడ్డాయి. రాజకీయంగా ప్రత్యర్థులను వేధించే ప్రక్రియ గత ప్రభుత్వాల హయాంలోనూ సాగినా మోదీ పాలనలో అది పరాకాష్టకు చేరింది. తమకు రాజకీయ ప్రత్యర్థులు అనేవారే ఉండకూడదనేది మోదీ, అమిత్ షాల లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తమిళనాడు, జమ్మూకశ్మీర్లో వారివురు అనుసరిం చిన విధానాలు ప్రజాస్వామ్యానికే తలవంపులుగా మిగిలా యి. ఇక నేడు ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా వారు అదే విధా నాన్ని అనుసరిస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడికి  ప్రత్యక్ష నిదర్శనం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు. వారి వురూ అవసరమైనప్పుడు మిత్రత్వం నెరపటం, అవసరం తీరాక శత్రుత్వం వహించటం అనేది గత ముప్పై ఏండ్లుగా జరుగుతున్నదే. గత నాలుగేళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆ రెండు పార్టీలు నేడు కత్తులు దూసుకోవటం విచిత్రమేమి కాదు. బీజేపీతో కలిస్తే కేంద్రం నుంచి గణనీయంగా నిధులు రాబట్టి, విభజన హామీలను అమలుపరుచుకుని మరలా అధికారంలోకి రావచ్చుననే ఉద్దేశంతోనే గత సార్వత్రిక ఎన్ని కలకు ముందు తెలుగుదేశం ఆ పార్టీతో జతకట్టింది. కానీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో కమలదళం అధికారంలోకి రావటంతో సైకిల్ ఆశలకు గండిపడింది. రైతు రుణమాఫీ మొదలుకుని పోలవరం, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హో దా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, రైల్వేజోన్ ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహక రించకపోగా కొర్రీలు వెయ్యడం విశేషం. నిజానికి ఆయా అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి మేలుచేసి ఉంటే కమలదళం ఆంధ్రలో గణనీయంగా బలపడేదే. కానీ రాష్ట్రంలో నెలకొని ఉన్న కులరాజకీయాలు అందుకు సహకరించలేదు. తమ పార్టీ బలపడకపోయినా పరవాలేదు. ముందుముందు వచ్చే తమ కులానికి చెందిన నాయకునికి మేలు జరగాలంటే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటేనే మంచిది అనేది ఆంధ్ర బీజేపీలో కొందరి నాయకుల అభిమతం. వారు వేసిన ఎత్తులే కేంద్ర పెద్దలు రాష్ట్రంపై శీతకన్ను వేసే లా చేశాయన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో భాగం గా గతవారంలో ఆ పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న ప్రధాని వారితో సంభాషిస్తూ ఆంధ్రలో ప్రజలు మార్పు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ మార్పు ఏ వైపు అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. పైగా ఆ పార్టీ నాయకుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిని పట్టుకుని హీనంగా దూషిస్తుంటే ప్రధాని ముసిముసి నవ్వులు నవ్వుకోవడం ఆశ్చర్యకరం. తెలంగాణలో మహాకూటమిని ఓడించడం ద్వారా అక్కడి ప్రజలు తమనేదో గెలిపించినట్లు కమనాథులు ఆనందపడటం చూస్తుంటే తమ కన్ను ఒకటి పోయినా పర్లే దు... అన్న సామెతను వారంతా అనుసరిస్తున్నారని అర్ధమ వుతోంది. దీనివల్ల వారికొచ్చే ప్రయోజనమేమిటో పైవాడికే ఎరుక. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కను కనే ఆంధ్రలో ప్రతిపక్షాలు కానీ, తెలంగాణలోని అధికార పక్షం కానీ భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి కానీ ఆ అధికారమే కనుక కోల్పోతే వారం దరి దృష్టిలో మునుపటి రీతిలోనే బీజేపీ ఒక అంటరాని పార్టీయే అన్నది జగమెరిగిన సత్యం. అంతెందుకు వెనుక ఎంతటి మిత్రత్వం ప్రదర్శిస్తున్నా ఆంధ్రలో ప్రతిపక్షాలు నేరుగా బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదంటేనే ఆంధ్రలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధమవుతోంది. ఆ మాత్రం దానికి ఆ పార్టీకి అంత అతిశయం ఎం దుకో అర్ధం కాదు. ఇక దేశంలో అలుముకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆంధ్ర సంగతి ఏమో కానీ దేశప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారన్న సంగతి విస్పష్టమవుతుంది. ప్రత్యర్థి పార్టీల మాటెలా ఉన్నా ముందు కమనాథులు తమ సంగతి చూసుకోవడం మేలు. 
గొడవర్తి శ్రీనివాసు
9963556696

Tags

సంబంధిత వార్తలు