ల‌వ్ ఎంటర్‌టైన‌ర్‌కు ఓకే చెప్పిన విజ‌య్‌

Updated By ManamThu, 05/17/2018 - 22:44
v

vయూత్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో, వరుస సినిమాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే విజయ్ నటించిన ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాగా.. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు.. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇదిలా ఉంటే..  మ‌రోవైపు తన తదుపరి ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు ఈ యంగ్ హీరో. కొంత కాలం క్రితం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్, ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన కథలను విన్న విజయ్.. ఇద్దరికీ ఓకే చెప్పారు.

అయితే.. ఇప్పుడు ముందుగా నందినీ రెడ్డితో సినిమాను చేయనున్నార‌ట‌. లవ్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని స్వప్న సినిమా  బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించనున్నారు. ‘నోటా’ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నందినీ రెడ్డి సినిమాతో పాటు.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా సమాంతరంగా నటించనున్నారు విజయ్. వీటి తర్వాత క్రాంతి మాధవ్‌తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

English Title
vijay devarakonda next project details
Related News