తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో ఉపరాష్ట్రపతి చర్చలు

Venkiah Naidu
  • రేణిగుంట నుంచి వెంకటాచలం(నెల్లూరు) వరకూ రైలులో ప్రయాణించిన వెంకయ్యనాయుడు

  • ఆ సమయంలో రైల్వే అధికారులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై భేటీ

  • నడికుడి - శ్రీకాళహస్తి మార్గం పనుల గురించి ప్రత్యేక చర్చ

హైదరాబాద్: ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అత్తగారి దశదిన కార్యక్రమాల కోసం ఢిల్లీ నుంచి నెల్లూరు బయలు దేరారు. ఢిల్లీ నుంచి రేణి గుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి రైలు మార్గంలో వెంకటాచలం (నెల్లూరు) చేరుకున్నారు. ఉపరాష్ర్టపతి రైలు ప్రయాణం చేయడమే కాకుండా, ఆ సమయాన్ని పలు రైల్వే ప్రాజెక్టుల గురించి అధికారులతో మాట్లాడేందుకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రైల్వే ప్రాజెక్టులు చర్చకు వచ్చాయి. ఈ సమా వేశానికి జనరల్ మేనేజర్ శ్రీ ఆర్.కె.కులశ్రేష్ఠ, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ శివప్రసాద్, డి.ఆర్.ఎమ్. శ్రీ విజయ్ ప్రతాప్ సింగ్, ఆర్వీ ఎన్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కమలాకర్ రెడ్డి హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రవాణా సౌకర్యాలు కీలకమనే  విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ముందుకు సాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ముఖ్యంగా కృష్ణ పట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను మరియు నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పనుల గురించి ప్రత్యే కంగా అధికారులతో చర్చించారు.వీటితో పాటు గూడూరు విజయవాడ మూడో లైను, గుంటూరు-అమరావతి- విజయవాడ రైల్వేలైను, గుంతకల్లు స్టేషన్, నెల్లూరు నూతన స్టేషన్లతో పాటు గూడూరు, రేణిగుంట స్టేషన్లలో వైఫై సౌకర్యం గురించి చర్చించారు. వీటితో పాటుగా ఈ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన సువిధ డైనమిక్ ఫెయిర్ ట్రైన్స్ గురించి కూడా మాట్లాడారు. వీటిలో టిక్కెట్టు ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, మధ్యతరగతికి సౌకర్య వంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు కడప జిల్లాల మధ్య ముడిసరుకుల రవాణా మరియు ప్రయాణ సౌకర్యాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ఉద్దేశించిన కృష్ణ పట్నం-ఓబుల వారి పల్లె రైల్వే లైన్ సొరంగం పనుల గురించి గతంలోనే రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ని తన ఛాంబర్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పట్లో రైల్వే బోర్డు చైర్మన్ లోహాని,ఆర్వీఎన్‌ఎల్ ముఖ్య అధికారి ప్రదీప్‌గౌర్  కూడా ఈ సమావేశానికి హాజర య్యారు. ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి కాను న్నట్లు ఉపరాష్ర్టపతికి పూర్తి వివరాలను రైల్వే అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఆ పనుల గురించి మరో సారి ఉపరాష్ర్టపతి రైల్వేఅధికారులతో చర్చించారు. ముందుగా తెలియజేసినట్లుగా ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి అయ్యేలా చూడాలనిసూచించారు. రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలను కలుపుతూ, కడప-నెల్లూరు మధ్య ముడిసరుకుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ ర్వైల్వే లైను ను ప్రజా రవాణా కోసం కూడా అందుబాటులో తెచ్చేం దుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సాను కూలమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆలోచించాలని ఉపరాష్ర్టపతి గతంలోనే రైల్వే మంత్రికి సూచించారు. ఈ విషయాన్ని అధికారులకు కూడా వివరించి, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

నడికుడి - శ్రీ కాళహస్తి రైల్వే లైను విషయంలోనూ ఉపరాష్ర్టపతి, రైల్వే అధికారులతో మాట్లాడారు. పనుల వేగం, ఏ సమయానికి పూర్తి కావొచ్చు తదితర అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు రైల్వే అధికారులు వివరాలు అందించారు. రాష్ర్ట ప్రభుత్వం  2016 ఆగష్టులో 45 కి.మి విస్తీర్ణం కలిగిన భూమిని పిడుగురాళ్ళ - సవలాయ పురం మధ్య అందించిందని, అయితే అందులో రెండు చోట్లు భూమి విషయంలో వివాదాలు తలెత్తి, ప్రస్తుతం అది హైకోర్టులో వివాదం నడుస్తోందని, దీని మీద రాష్ర్ట ప్రభుత్వం వివరాలు అందించాల్సి ఉందని తెలిపారు. అధేవి దంగా పిడుగురాళ్ళ-రొంపిచర్ల మధ్య వివా దంలో ఉన్న భూమి మినహా మిగిలిన ప్రదేశంలో పనులు పూర్తి అయ్యాయని, వివాదాలు తేలిన తర్వాత మిగిలిన చోట కూడా పని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఇప్పటికే పూర్తైన రైల్వే లైను విషయంలో రాష్ర్ట ప్రభుత్వంతో పాటు పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఆమోదం రావలసి ఉందని తెలిపారు. ఈవిషయంలో వెంటనే చొరవ తీసుకో వాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తిఅయ్యేలా చూడా లని సూచించారు. క్లియరెన్స్ రావలసిన కేంద్ర మంత్రిత్వ శాఖలతో తానుమాట్లాడతానని తెలిపారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న అన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వీటికి కావలసిన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.అవసరమైన శాఖల మంత్రులతో తాను మాట్లాడతానని, ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు