21మంది భారత సంతతి వ్యక్తులకు జైలు

Updated By ManamSat, 07/21/2018 - 12:55
US Call Centre Scam
  • కాల్ సెంటర్ కుంభకోణం కేసులో 20  ఏళ్లు జైలుశిక్ష

US call centre scam

న్యూయార్క్ : కాల్ సెంటర్ కుంభకోణం కేసులో భారత సంతతికి చెందిన 21మందికి అమెరికా కోర్టు ఇరవై ఏళ్లు జైలుశిక్ష విధించింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఈ నకిలీ కాల్ సెంటర్ల దందాలో అమెరికాలోని వేలాదిమంది వందల మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు.

2012 నుంచి 2016 మధ్య జరిగిన పలు మోసాల్లో 21మంది దోషులుగా తేలారు. నేరాల తీవ్రతను బట్టి వారికి నాలుగేళ్ల నుంచి సుమారు 20 ఏళ్ల వరకూ శిక్షలు అమలు కానున్నాయి. అలాగే శిక్షాకాలం పూర్తయిన వెంటనే వారిని భారత్‌కు పంపించనున్నారు. గతంలోనూ మోసం, మనీ లాండరింగ్ కేసులో ముగ్గురికి అమెరికా కోర్టు శిక్షలు విధించిన విషయం తెలిసిందే.

English Title
US Call Centre Scam:20 Indian-Origin People Sentenced
Related News