తెలంగాణకు రక్త పోటు

Updated By ManamThu, 05/17/2018 - 14:52
Telangana Suffers High Blood Pressure
  • దేశంలోనే రెండో స్థానం.. హైదరాబాద్‌లో 30 శాతం మందికి హైబీపీ

Telangana Suffers High Blood Pressureహైదరాబాద్: ప్రపంచీకరణ కావొచ్చు.. ఉరుకుల పరుగుల జీవితం కావొచ్చు.. కారణమేదైతేనేం నేటి తరం జీవన శైలి మారింది. ఆహారపుటలవాట్లూ మారాయి. ఫలితం ఎక్కడలేని అనారోగ్య అనర్థాలను తీసుకొస్తున్నాయి. అందులో ఒకటి హై బీపీ. చిన్నాపెద్దా అన్న తారతమ్యం లేకుండా, వయసు భేదం చూడకుండా దాడి చేసేస్తోంది రక్తపోటు. అలా బీపీ బారిన పడుతున్న వారిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెదక్ జిల్లాలో బీపీ బాధితులున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 39 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలను హైబీపీ వేధిస్తోంది. జాతీయ పోషకాహార నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అధిక రక్తపోటుతో సతమతమవుతోంది. ఇక, హైదరాబాద్‌లో 30 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇక, రక్తపోటు ఉన్నట్టు దాదాపు 90 శాతం మందికి తెలియకపోవడం గమనార్హం. తెలిసిన వారిలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నవారు కేవలం 10 శాతం మందే. పాతికేళ్లు దాటిన ప్రతి పది మందిలో నలుగురు బీపీ బారిన పడుతున్నట్టు తేలింది. అత్యధికంగా మార్కెటింగ్, ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లోనే ఆ సమస్య విజృంభిస్తోందని నిపుణులు చెప్పడం కలవరపరుస్తోంది. బీపీ వచ్చిన వాళ్లలో 40 శాతం మంది గుండెపోటు ముప్పును ఎదుర్కోవడంతో పాటు 25 శాతం మంది మూత్ర పిండాల సమస్యలతో సతమతమవుతున్నారు. మరో 10 శాతం పక్షవాతం వచ్చి జీవచ్ఛవాలు అవుతున్నారు. 

English Title
Telangana Suffers High Blood Pressure
Related News