టీ20, టీ10 లీగ్స్‌పై కఠిన చర్యలు

Updated By ManamTue, 10/16/2018 - 06:20
ICC-Geoff-Allardice
  • నేటి నుంచి ఐసీసీ సమావేశాలు

ICC-Geoff-Allardiceసింగపూర్: ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడు గుల్లా పెరుగుతున్న టీ20, టీ10 లీగ్స్‌పై విస్తృత పరిశీలనే ప్రధాన ఎజెండాగా ఐసీసీ సమా వేశాలు జరగనున్నాయి. మంగళవారమిక్కడ ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయి. కనక వర్షం కురిపించే ఐపీఎల్ తరహా లీగ్‌లను అనేక సభ్య దేశాలు ప్రవేళ పెడుతండటంతో క్రికెట్‌లో అవినీతి ప్రమాదం పొంచివుంది. తాజాగా ఆఫ్ఘానిస్థాన్ కూడా టీ20 లీగ్‌ను ప్రారంభించింది. ఈ లీగ్‌కు యూఏఈ ఆతిథ్యమిచ్చింది. టీ20 ఫార్మాట్‌కు విశేష ఆదరణ లభించడంతో ఐసీసీ గత ఏడాది టీ10 లీగ్‌కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ సమావేశాల గురించి ఐసీసీ క్రికెట్ జనరల్ మేనేజర్ జెఫ్ అలర్డైస్ మాట్లాడుతూ.. ‘టోర్నీలకు అనుమతి, నిబంధనలు వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నాం. అంతేకాకుండా లీగ్స్‌కు ప్లేయర్స్ పంపడాన్ని కూడా పరిశీలిస్తాం. ఒక టోర్నీకి అనుమతి ఇచ్చే ముందు డాక్యుమెంటేషన్, ఫ్రాంచైజీ యాజమాన్యాల గురించి, లీగ్ నడిపేందుకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వంటి అంశాలను పరిశీలిస్తాం. అంటే ఇక నుంచి లీగ్ నిర్వహణ అనుమతులు కఠినతరంగా ఉంటాయి’ అని అన్నారు.

English Title
Tea 20 and Tea Strict actions on 10 leagues
Related News