క్యూ3లో టీసీఎస్ అదరహో

Tata Consultancy Services
  • భారీ లాభాలను ఆర్జించిన టెకీ దిగ్జజం

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ అంచనాలకు మించి రికార్డు లాభాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 24.1 శాతం వ ద్ధితో రూ.8,105 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2017-18 ఇదే క్యూ3లో రూ.6,531 కోట్ల లాభాలు ఆర్జించింది. టాటా గ్రూపునకు సింహభాగం రెవెన్యూను అందిస్తుంది. క్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ రెవెన్యూలో 21 శాతం వ ద్ధి చోటు చేసుకుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండి రాజేష్ గోపినాథ్ పేర్కొన్నారు. గత 14 త్రైమాసికాల్లో ఇదే రికార్డు రెవెన్యూ అని పేర్కొన్నారు. భౌగోళికంగానూ, అన్ని కేటగిరీల్లోనూ మెరుగైన వద్ధిని నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.2 మధ్యంతర డివిడెండ్ అందించడానికి కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. దీంతో వరుసగా మూడోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్లయ్యింది. తాజాగా ప్రకటించిన ఈ డివిడెండ్‌ను జనవరి 24 నాటికి చెల్లించనున్నారు. కాగా జనవరి 18వ తేదిని రికార్డు తేదిగా గుర్తించనున్నారు. మూడో త్రైమాసికంలో కొత్తగా 6,827 మంది ఉద్యోగు లను తీసుకున్నారు. దీంతో డిసెంబర్ ముగింపు నాటికి టిసిఎస్ మొత్తం సిబ్బంది 4,17,929కి చేరింది. గురువారం బిఎస్‌ఇలో టిసిఎస్ షేర్ 0.02 శాతం పెరిగి రూ.1,885 వద్ద ముగిసింది. ఐటి కంపెనీ ఒక త్రైమాసికంలో రూ.8000 కోట్ల పైగా లాభాలు నమోదు చేయడం సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఒక కీలక మైలురాయి. ఇంతక్రితం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.7,927 కోట్ల లాభాల నమోదు చేసింది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 20.80 శాతం పెరిగి రూ.37,338 కోట్లుగా చోటు చేసుకుందని బిఎస్‌ఇకి టిఎస్‌ఎస్ వెల్లడించింది. స్థిర కరెన్సీ ధరల వల్ల కంపెనీ రెవెన్యూ త్రైమాసికం, త్రైమాసికానికి 1.8 శాతం, ఏడాదికేడాదికి గాను 12.1 శాతం పెరుగుదల నమోదయ్యింది. గత క్యూ3లో డిజిటల్ ఎకౌంట్ రెవెన్యూ 52.7 శాతం వ ద్ధిని నమోదు చేసింది. మొత్తం రెవెన్యూలో ఈ విభాగం వాటా 30.1 శాతంగా ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు